Parineeta - Raghav Chadha Engagement: పుకార్లకు చెక్‌పెట్టిన పరిణితీ చోప్రా, ఢిల్లీలో ఘనంగా ఎంగేజ్‌మెంట్, వేడుకలో సందడి చేసి బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు
ఆప్ ఎంపీ రాఘవ్ ఛద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం (Parineeta Engagement With Raghav) చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుండటంతో అభిమానులతో పాటు వారి శ్రేయోభిలాషులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
New Delhi, May 13: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeta Chopra) గతకొంత కాలంగా ఆప్ ఎంపీ రాఘవ్ ఛద్దాతో (Raghav Chadha) ప్రేమాయణం కొనసాగిస్తుందనే వార్తలు బిటౌన్‌లో జోరుగా వినిపించాయి. అయితే, ఈ వార్తలపై అమ్మడు మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. దీంతో వారిద్దరి మధ్య ఏముందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా చూసింది. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో వీరి రిలేషన్ గురించి వచ్చిన వార్తలన్నింటినీ నిజం చేస్తూ తాజాగా ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. ఆప్ ఎంపీ రాఘవ్ ఛద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం (Parineeta Engagement With Raghav) చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుండటంతో అభిమానులతో పాటు వారి శ్రేయోభిలాషులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ జంట తమ వివాహ వేడుకను ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్‌కు (Parineeta Chopra Engagement) సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ ఆమెకు తమ విషెస్ తెలుపుతూ నెట్టింట ఈ బ్యూటీని ట్రెండింగ్ చేస్తున్నారు.
ఢిల్లీలోని కపుర్తలా హౌజ్‌లో ఇరువురి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ వేడుకకు కేంద్రమాజీ మంత్రి చిదంబరం, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాక్రే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటూ పలువురు బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఇక పరిణితి చోప్రా ఎంగేజ్‌మెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. తన కజిన్ అయిన పరిణతి ఎంగేజ్‌మెంట్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు.
గతకొంతకాలంగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణితి చోప్రా చెట్టాపట్లాలు వేసుకొని తిరుగుతున్నారు. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఒకరు రాజకీయవేత్త, మరొకరు బాలీవుడ్ సెలబ్రెటీ కావడంతో ఎంగేజ్‌మెంట్ వేడుకలో ప్రముఖులు సందడి చేశారు.