Poonam Kaur: బావ సినిమా సూపర్ హిట్! మరోసారి రచ్చ రేపిన పూనమ్ కౌర్ పోస్ట్, సినిమా పేరు చెప్పకుండా పోస్ట్ చేసిన పూనమ్, మాకు తెలుసులే అంటున్న ఫ్యాన్స్
బావ సినిమాకి (Bawa Cinema) వచ్చాను అక్కా అంటూ ఎవరో ఆమెతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను పంచుకుంది. దానికి ఆమె కూడా ఓకే అన్నట్లుగా కళ్ళు మూసుకున్న ఎమోజీలను పెడుతూ.. సినిమా ఎలా ఉందో చెప్పమని హానెస్ట్ రివ్యూ ఇవ్వమని పూనమ్ అడుగుతోంది.
Hyderabad, Feb 25: సినిమాలు మానేసిన తర్వాత...సోషల్ మీడియాలో (Social Media) చాలా యాక్టీవ్ గా ఉంటున్న పూనమ్ కౌర్ (Poonam Kaur) మరోసారి వైరల్ గా మారింది. ఆ మధ్య ప్రముఖుల మీద ట్వీట్ల యుద్ధం చేసిన పూనమ్(Poonam Kaur), కొంతకాలంగా సైలెంట్ అయింది. అయితే తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. పూనమ్ కౌర్ షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బావ సినిమాకి (Bawa Cinema) వచ్చాను అక్కా అంటూ ఎవరో ఆమెతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను పంచుకుంది. దానికి ఆమె కూడా ఓకే అన్నట్లుగా కళ్ళు మూసుకున్న ఎమోజీలను పెడుతూ.. సినిమా ఎలా ఉందో చెప్పమని హానెస్ట్ రివ్యూ ఇవ్వమని పూనమ్ అడుగుతోంది. దానికి అవతలి వ్యక్తి కూడా ఒకే అన్నారు. ఆ తర్వాత అతను సినిమా హిట్టు నిజంగా చెప్తున్నా అక్కా సినిమా సూపర్ హిట్టు అంటూ చాట్ చేశాడు. ఇది ఎవరితో ఆమె చాట్ చేసిందో.. ఏ సినిమా గురించి వీళ్ళు మాట్లాడుకున్నారో.. చాట్ చేసిన వ్యక్తి ఏ సినిమాకి వెళ్ళాడో.. ఇంతకీ ఈ బావ ఎవరన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక.. ఇదంతా ఏ సినిమా గురించో నెటిజన్లు ఎవరికి వారు అవగాహనకు వచ్చేసి.. బావ సినిమా సూపర్ హిట్టు అక్కా అంటూ పూనమ్ కు రిటర్న్ కామెంట్లు పెడుతున్నారు. పూనమ్ గతంలో టాలీవుడ్ లోని ప్రముఖులపై, హీరోలపై కొన్ని వివాదాస్పద ట్విట్లు చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. ఓ మూవీ క్రిటిక్ కూడా పూనమ్ కు ఏదో అన్యాయం జరిగిపోయిందని పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి కూడా తెలిసిందే. అయితే పూనమ్ పెట్టి పోస్టును చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇదంతా రీసెంట్ గా రిలీజైన ఒక టాలీవుడ్ మూవీ గురించే అయి ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు.