Actor Eswar Rao Dies: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, అలనాటి ప్రముఖ నటుడు ఈశ్వరరావు అమెరికాలో కన్నుమూత
సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి చెందారు. మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా అక్టోబర్ 31న మృతి చెందారు.
తెలుగు పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు మృతి చెందారు. మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా అక్టోబర్ 31న మృతి చెందారు. ఈ వార్త ఆలస్యంగా తెలిసింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఈశ్వరరావు దాదాపు తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
తొలి సినిమా స్వర్గం నరకం హిట్ అందుకున్న ఆయన కాంస్య నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత దేవతలారా దీవించండి, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. చివరిసారిగా చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కనిపించారు.