Prabhas Birthday Special: ప్రభాస్ తమవాడే అంటున్న నార్త్ ఇండియన్ ప్రేక్షకులు, ప్రభాస్ 'డార్లింగ్' అంటే తమకు ఎందుకంత ఇష్టమో నార్త్ ప్రేక్షకులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు
ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'Happy Birthday Darling Prabhas' అంటూ విషెస్ చెప్తున్నారు....
ప్రభాస్ (Prabhas) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకే కాదు ఇండియాలోని అన్ని ప్రాంతాల వారికి డార్లింగ్. బాహుబలి (Bahubali) సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌కి నార్త్ లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. నార్త్ ఇండియన్స్ కూడా ఇప్పుడు ప్రభాస్ మా హీరో అని చెప్పుకుంటున్నారు. బాహుబలి, సాహో సినిమాలకు ముందే ప్రభాస్ తమకు తెలుసు అని, ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ నటించింది. అప్పుడు కంగనా పక్కన ప్రభాస్‌ను చూసిన చాలా మంది నార్త్ ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారంట. అప్పట్నించే ప్రభాస్‌కు ఫ్యాన్స్ అయిపోయారంట. సౌత్ నుంచి ఇంత టాలెంటెడ్ హీరోస్, ఇంత హాండ్సమ్ హీరోస్ ఉంటారా అని ఆశ్చర్యపోయామని చెప్తున్నారు. అయితే అప్పట్లో ప్రభాస్ గురించి అంతగా తెలియదు బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ గురించి చాలా తెలిసింది. కేవలం అతడి ఒడ్డు, పొడుగు, హీరోయిజం మాత్రమే కాదు ముఖ్యంగా ప్రభాస్ వ్యక్తిత్వం, వృత్తి పట్ల అతడు చూపించే అంకితభావం మరియు అతడి మాట్లాడే మాటల్లో ఎంతో నిజాయితీ కనబడుతుందని నార్త్ ప్రేక్షకులు చెప్తున్నారు.
ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నార్త్ ప్రేక్షకులను పలకరించినపుడు తాము ప్రభాస్‌ను బాలీవుడ్ హీరోలతో సమానంగా ఎందుకు ఇష్టపడుతున్నారో కొన్ని ముఖ్యమైన కారణాలు చెప్పారు.
ఏ హీరోకి లేని అసాధారణమైన పర్సనాలిటీ
బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ ఒక సూపర్ స్టార్. అందరూ షారుఖ్‌ను ఇష్టపడతారు. షారుఖ్ ఒక రొమాంటిక్ హీరో , స్క్రీన్‌పై అతడి రొమాన్స్ అల్టిమేట్, అలాగే హృతిక్ రోషన్‌ను యాక్షన్ కోసం ఇష్టపడతాం. కానీ ఈ రెండూ సమాన పాళ్లలో కలిగిన హీరో ప్రభాస్. ప్రభాస్ ఎవరినైనా అతడి వైపు చూపు తిప్పుకునేలా చేస్తాడు. ఒక పక్కింటి అబ్బాయిలాగా ఎంతో సహజంగా కనిపిస్తాడు. ప్రభాస్ నవ్వు చాలా సహజంగా ఉంటుంది. ఆ నవ్వులో ఒక ఆత్మీయత కనిపిస్తుంది. అని చెప్పారు.
ఎక్కువ హడావిడి ఉండదు, తన స్టార్‌డమ్ చూపించుకోడు
ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ అయినా కూడా ఎప్పుడూ, ఎక్కడా కూడా అలాంటి గర్వాన్ని ప్రదర్శించడు. ఆయన సినిమాలు విడుదలయినపుడు మినహా అతడు కనిపించేది చాలా తక్కువ. ఇంటర్వ్యూలలో కూడా సినిమాలపైనే మాట్లాడుతాడు తప్ప, అతడి వ్యక్తిగత విషయాల గురించి మాట్లడడు, ఎలాంటి స్టార్‌డమ్ చూపించుకోడు. ఈరోజుల్లో సోషల్ మీడియాలో తక్కువగా, సెట్స్‌లో ఎక్కువ గడపడానికి ఇష్టపడే ఒక సెలబ్రిటీ కనిపించడం చాలా అరుదు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడు, తన పనేదో తాను చూసుకుంటాడు.
వృత్తి పట్ల అంకితభావం
ప్రతీ నటుడికి తన వృత్తి పట్ల నమ్మకం, అంకితభావం ఎంతో అవసరం. అలాంటి వారిలో ప్రభాస్ నెం1 స్థానంలో నిలుస్తారు. బాహుబలి కోసం 5 సంవత్సరాలు, ఆ తర్వాత సాహో సినిమా కోసం మరికొన్ని సంవత్సరాలు తనని తాను అంకితమిచ్చుకున్నాడు. ఈ కాలంలో అతడు వేరే సినిమాలపై దృష్టి పెట్టడం కానీ, వేరే ఆలోచనల వైపు మళ్ళడం కానీ చేయలేదు అంటే అర్థం చేసుకోవచ్చు అతడి అంకితభావం ఎలా ఉందనేది.
బాక్స్ ఆఫీస్‌కు బాహుబలి
బాహుబలి సినిమాతో ఇంతవరకూ ఇండియాలో ఏ టాప్ హీరో అందుకోలేని బాక్సాఫీస్ రికార్డులను ప్రభాస్ అందుకున్నాడు. అది కేవలం రాజమౌళి గొప్పదనమే కాదు. అక్కడ ప్రభాస్ ఉండటం వల్ల, ఆ సినిమా అతడికి మాత్రమే సరిపోయింది. అతడి స్థానంలో వేరే ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఈ రికార్డులు సాధ్యం అయ్యేవి కావు. రాజమౌళి లేకుండా ఓ చిన్న డైరెక్టర్‌తో కూడా ప్రభాస్ నార్త్ ఇండియాలో సూపర్ హిట్ అయ్యాడు. తన తొలి హిందీ స్ట్రయిట్ చిత్రం సాహో బాలీవుడ్‌లో రూ. 142.95 కోట్లు కలెక్ట్ చేసింది. సౌత్ నుంచి వచ్చిన ఒక హీరో సినిమాకి ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌కు రావడం ఇదే తొలిసారి. అదే అతడి స్టామినా ఏంటో చెప్తుంది.
యాక్షన్ హీరో
కేవలం బాలీవుడ్‌లో మాత్రమే కాదు, ఇండియాలో చాలా చోట్ల టాలెంటెడ్ నటులు ఉన్నారని ప్రభాస్ నిరూపించాడు. తనను తాను ఒక బాహుబలిగా మలుచుకొని నేడు భారతదేశంలో ఒక స్టార్ హీరోగా ప్రభాస్ నిలబడగలిగాడు. బాలీవుడ్‌లో ఎన్నో యాక్షన్ సినిమాలు వచ్చాయి, ఎంతో మంది యాక్షన్ హీరోలు ఉన్నారు. కానీ వారి యాక్షన్‌లో ఏదో తెలియని లోటును పూరించిన వాడు ప్రభాస్ అని చెప్తున్నారు. హీరోలు యాక్షన్ స్టంట్స్ చేస్తున్నపుడు అద్భుతంగా ఉంటుంది. అవే యాక్షన్ స్టంట్స్ ప్రభాస్ చేస్తే ఇంకో లెవెల్లో ఉంటుంది అంటూ నార్త్ ప్రేక్షకులు తాము ప్రభాస్‌ను ఎందుకు ఇష్టపడుతారో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'Happy Birthday Darling Prabhas' అంటూ విషెస్ చెప్తున్నారు.