Raj Tarun Case: లావణ్య కేసులో హైకోర్టును ఆశ్రయించిన హీరో రాజ్ తరుణ్, విచారణ రేపటికి వాయిదా
పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులకు హైకోర్టు (TG High Court) ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Hyderabad, AUG 01: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj tarun) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ మంజూరు (Bail Petition) చేయాలని పిటిషన్ వేశాడు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులకు హైకోర్టు (TG High Court) ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ – లావణ్య (Tarun -Lavanya) వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. లావణ్యతో రాజ్ తరుణ్ చాలా కాలం పాటు సహజీవనం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆమెతో 2017 నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ అంటున్నాడు. అయితే, ఏడాది క్రితం వరకు తామిద్దం కలిసున్నామని లావణ్య అంటోంది. తనకు రాజ్ తరుణ్ కావాలని వాదిస్తోంది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడని లావణ్య ఆరోపణలు చేస్తోంది. మీడియా సమావేశాలు నిర్వహించి రాజ్ తరుణ్ మీద ఎన్నో రకాలుగా లావణ్య ఆరోపణలు చేసింది. ఆడియో రికార్డ్స్ కూడా బయటికి వచ్చాయి. మస్తాన్ సాయితో లావణ్య సన్నిహితంగా ఉందనిబ రాజ్ తరుణ్ కూడా ఆరోపణలు చేశారు.