Rajinikanth Exits Politics: నేను రాజకీయాల్లోకి రావడం లేదు, మక్కళ్ మండ్రంను రద్దు చేస్తున్నా, సంచలన ప్రకటన చేసిన రజినీకాంత్, దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు, రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో భేటీ అయిన సూపర్‌స్టార్
తాజాగా రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో భేటీ అయిన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. నేను రాజకీయాల్లోకి రావట్లేదు. మక్కళ్ మండ్రంను రద్దు (Dissolving Rajini Makkal Mandram) చేస్తున్నా.
ఇకపై తాను రాజకీయాల్లోకి రావట్లేదని అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి స్పష్టం (Rajinikanth Political Row) చేశారు. తాజాగా రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో భేటీ అయిన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. నేను రాజకీయాల్లోకి రావట్లేదు. మక్కళ్ మండ్రంను రద్దు (Dissolving Rajini Makkal Mandram) చేస్తున్నాను. దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు చేస్తున్నాను’ అని రజనీ ప్రకటించారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం పోయెస్ గార్డెన్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.
‘సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల నేను అమెరికా వెళ్లొచ్చాను. సినిమా షూటింగులు, ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల రీత్యా గత కొంతకాలం నుంచి మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయాను. ఈ క్రమంలోనే నేడు నిర్వాహకులందరితో సమావేశమయ్యాను. వాళ్లందరికీ నా రాజకీయ అరంగేట్రంపై ఎన్నో సందేహాలున్నాయి. భవిష్యత్తులో నేను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అని వాళ్లు నన్ను అడుగుతున్నారు.
Here's Update
రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతారంటూ ఎంతో కాలంగా కొనసాగిన చర్చలకు గతేడాది డిసెంబర్‌లో ఆయన చెక్‌పెట్టిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన విరమించుకుంటున్నట్టు స్పష్టం చేశారు.