Ram Charan: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు బొమ్మ, సినిమా రంగానికి చేసిన సేవలకు గాను మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు
సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేస్తారు. తాజాగా, మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు... రామ్ చరణ్ కొలతలను తీసుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మైనపు బొమ్మను ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేస్తారు. తాజాగా, మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు... రామ్ చరణ్ కొలతలను తీసుకున్నారు. చెర్రీ మైనపు బొమ్మను 2025 వేసవి నాటికి అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డ్స్ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 'మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు'ను ఇస్తున్నట్లు వెల్లడించారు.
సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో తనకు స్థానం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు. తాను చిన్న వయస్సులో ఉన్నప్పుడు దిగ్గజ వ్యక్తులను అక్కడ చూసి ఆనందించేవాడినని, కానీ ఏదో ఒకరోజు అలాంటి వారి మధ్య తాను ఉంటానని కలలో కూడా అనుకోలేదన్నారు. సినిమా కోసం తాను పడే తపన, కృషి, అభిరుచికి ఇది గుర్తింపు అన్నారు. ఇలాంటి అద్భుతమైన అవకాశం దక్కినందుకు తాను కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు.