Rashmika Mandanna AI Deepfake Video: డీప్ ఫేక్ వీడియో, కన్నీటి పర్యంతమైన నటి రష్మిక మందన్న, ఈ వీడియోపై ఎవరెవరు ఏమన్నారంటే...
దీంతో రష్మిక ఏంటి.. ఇలాంటి వీడియో ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ప్రముఖ నటి రష్మిక మందన్నకు సంబంధించి ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది.నేటి ఉదయం నుంచి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో బ్లాక్ కలర్ టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో వల్గర్ గా ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వడానికి రష్మిక నిలబడిన వీడియో సెన్సేషన్ సృష్టించింది. దీంతో రష్మిక ఏంటి.. ఇలాంటి వీడియో ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే.. ఇది ఒరిజినల్ వీడియో కాదని, ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదని.. వేరే అమ్మాయి ముఖాన్నీ AI టెక్నాలజీతో రష్మిక ఫేస్ పెట్టి రిలీజ్ చేశారు. ఇక దీంతో ప్రతి ఒక్కరు రష్మికకు సపోర్ట్ గా నిలిచారు. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ సైతం.. దీనిపై లీగల్ చర్యలు తీసుకోవాలని తెలిపాడు. ఇక తాజాగా ఈ ఫేక్ వీడియోపై రష్మిక ట్విట్టర్ ద్వారాస్పందించింది.
నటి రష్మిక దీనిపై స్పందిస్తూ, 'సాంకేతికత దుర్వినియోగం అవుతోంది' కాబట్టి ప్రజలు దీనిని అందరూ పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోరింది. నటి ఆమె కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపింది.ఈ ఘటన గురించి మాట్లాడడం చేయడం నాకు చాలా బాధగా ఉంది. ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడవలసి వచ్చింది. ఇలాంటివి నిజం చెప్పాలంటే.. నాకే కాదు, చాలామందిని భయానికి గురిచేస్తోంది.డీప్‌ఫేక్ వీడియోల వల్ల కలిగే హానిని చూస్తే నాకు చాలా బాధనిపిస్తుందని.. రష్మిక మందన్న తీవ్ర ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేసింది.
Here's Video
క్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే భయంతో పాటు.. వాటి వలన నష్టాలు ఎలా ఉంటాయో అని చాలామంది భయపడుతున్నారు. ఈ రోజు ఒక మహిళగా మరియు నటిగా నాకు రక్షణ మరియు మద్దతు వ్యవస్థగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
Here's Amitabh Bachchan Tweet
కానీ ఇలాంటి ఘటనే నేను స్కూల్‌లో లేదా కాలేజీలో ఉన్నప్పుడు జరిగితే.. నేను దీన్ని ఎలా ఎదుర్కోగలనో నిజంగా ఊహించలేను. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మనమందరం ఒక కమ్యూనిటీగా మారి త్వరగా వీటికి పరిష్కారం చూపాలి” అని తెలుపుతూ సైబర్ క్రైమ్ ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Here's Her Tweet
రష్మిక మందన్న యొక్క వైరల్ డీప్‌ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఇలాంటి వాటిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె ట్వీట్ పై నెటిజన్లుకూడా స్పందించారు. ఎక్స్ లో వారు.. మేము ఇందులో మీకు తోడుగా ఉంటాము..దీనిపై అవగాహన పెంచుకుని సాంకేతికత దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి కలిసి పని చేద్దాం. ఇందులో మీరు ఒంటరిగా లేరు. మేము మీకు మద్దతు ఇస్తున్నాము" అని X లో ఓ నెటిజన్ రాశాడు. మరొక నెటిజన్ "ఈ వీడియో ఇప్పటికీ ఇంకా అలాగే ఉంది. తర్వాత కంటే ఇప్పుడే చర్య తీసుకోవడం మంచిదని రాశాడు.
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్నింగ్
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియస్‌గా స్పందించారు. తప్పుడు సమాచారానికి సంబంధించి ప్రస్తుతం డీప్ ఫేక్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా, హానికరమైనవిగానూ పరిణమిస్తున్నాయంటూ సోమవారం ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు ట్విటర్ వేదికగా ఐటీ చట్టంలోని పలు నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌పాంలకు కూడా కొన్ని సూచనలు అందించారు. అలాగే ఇంటర్నెట్ వినియోగదారులకు భద్రత, విశ్వాసాన్ని కలిగించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Here's Tweet
2023, ఏప్రిల్ నుంచిఅమల్లోకి వచ్చిన నిబంధనలు ప్రకారం సోషల్ బీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎలాంటి తప్పుడు సమాచారం ప్రసారం చేయకూడదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ గుర్తు చేశారు. వినియోగదారులు లేదా ప్రభుత్వం కానీ తప్పుడు సమాచారంపై ఫిర్యాదు చేసిన 36 గంటల్లో అటువంటి కంటెంట్‌ను తీసివేయవలసి ఉంటుందని వెల్లడించారు. భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారం, ఈ నిబంధనలను పాటించకపోతే ప్లాట్‌ఫారమ్‌పై చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. ఐటీ రూల్-7 ప్రకారం కఠిన చర్యలుంటాయిని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికపై వస్తున్న ఫేక్ వీడియోలపై బాధితులు కోర్టును ఆశ్రయించే హక్కు ఉందన్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో తప్పుడు సమాచారం వైరల్ అయ్యే ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత రియాక్షన్
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆన్‌లైన్‌లో అత్యంత సులువుగా వ్యాప్తి చెందుతున్న మానిప్యులేషన్స్‌కు ఇదొక తీవ్ర హెచ్చరిక లాంటిదంటూ రష్మిక టార్గెట్‌గా వచ్చిన డీప్ ఫేక్ వీడిమోపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ బెదిరింపుల నుంచి భారతీయ మహిళలను రక్షించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందు కోసం ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర చర్యలు తీసుకోవాలంటూ కవిత సోమవారం ట్వీట్ చేశారు.
Here's Tweet
అలాగే వీటిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఐటీ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌తోపాటు మరో కేంద్రం రాజీవ్ చంద్రశేఖర్‌కి విజ్ఞప్తి చేశారు.