Prabhas: మోకాలీ సర్జరీ తర్వాత ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ప్రభాస్.. ఫోటోస్ వైరల్

తన మోకాలీ సర్జరీ కోసం యూరప్ కు వెళ్లిన విషయం అందరికి తెలిసిందే.అయితే తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Prabhas in Air port (photo-X)

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీ నుంచి హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. తన మోకాలీ సర్జరీ కోసం యూరప్ కు వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అతని మోకాలీ సర్జరీ కోసమే యూరప్ కి వెళ్లిన ప్రభాస్.. సర్జరీ అనంతరం అక్కడే కొన్ని రోజుల పాటు ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. తను పూర్తిగా కోలుకున్న తర్వాత హైదరాబాద్ కు బయలుదేరి వచ్చాడు. తన పుట్టినరోజు అక్టోబర్ 23 నాడు కూడా అందుబాటులో లేకపోవడం.. అదేవిధంగా సలార్ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.  ఇంతటి అసంతృప్తిలో ఉన్న ఫ్యాన్స్ కి ప్రభాస్ తిరిగి వచ్చారనే వార్త వినగానే కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సలార్ మూవీ డిసెంబర్ 22 న విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా 44 రోజులు టైమ్ మాత్రమే ఉంది. అయినా ఇంతవరకు ఎలాంటి ప్రమోషన్స్ ప్రారంభించలేదు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకు దాదాపుగా రెండు నెలల ముందే ప్రమోషన్స్ ని స్టార్ చేసాడు రాజమౌళి.

యాత్ర 2లో సోనియా గాంధీ క్యారక్టర్ ఇదిగో, 2024 ఫిబ్రవరి 8న సినిమాను విడుదల చేయనున్న మేకర్స్

సలార్ చిత్రబృందం మాత్రం ఈ విషయంలో మేలుకోవడం లేదు ...సినిమా కంటెంట్ ఎంత ఉన్నా.. అలాగే స్టార్ హీరో లాంటి ప్రభాస్ ఉన్నప్పటికీ.. విడుదలకు ముందే సరైన ప్రమోషన్స్ వస్తేనే ఎలాంటి సినిమాకు అయినా భారీ అంచనాలు పెరుగుతాయి.  ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

యూరప్ నుంచి తిరిగొచ్చిన ప్రభాస్.. అతి తొందరలోనే సలార్ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడని..అలాగే ముంబై, హైదరాబాద్, చైన్నె లాంటి జంట నగరాల్లో ఈవేంట్స్ చేసేందుకు సలార్ టీమ్ ప్లాన్ చేసారని తెలుస్తుంది. ఇక పోతే ప్రభాస్ సలార్ మూవీ కి సంబంధించిన ప్రతి ఈవెంట్లలో పాల్గొని.. ఫ్యాన్స్ ని పలకరించబోతున్నాడట.

ఈ క్రమంలోనే దీపావళి పండుగ కానుకగా ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు. ప్రభాస్ ఈ రోజే హైదరాబాద్ కు తిరిగొచ్చాడు. తను రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతనే.. మెుదటగా సలార్ ప్రమోషన్స్ కు సమయం తీసుకుంటారట.. ఆ తర్వాత మారుతి సినిమా తో పాటు నాగ్ అశ్విన్ కల్కి 2898 AD చిత్రం షూటింగ్ లో పాల్గొంటారని.. తాజా సమాచారం.