Rishi Kapoor Demise: బాలీవుడ్ ‘బాబీ’ హీరో రిషికపూర్ కన్నుమూత, . క్యాన్సర్‌తో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు, సంతాపం వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు

ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) (Rishi Kapoor Demise) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను (Rishi Kapoor) కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం మరణించారు.

Rishi Kapoor (Photo Credits: Getty Images)

ఇర్ఫాన్ ఖాన్ విషాదం మరవక ముందే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) (Rishi Kapoor Demise) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను (Rishi Kapoor) కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం మరణించారు. బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత, కన్నతల్లిని కడసారి కూడా చూడలేకపోయిన బాలీవుడ్ నటుడు, పాన్ సింగ్ తోమర్ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడి అవార్డు

క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్‌ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా రిషీకపూర్‌ మృతిపై అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) ట్వీట్‌ చేశారు. మరోవైపు బాలీవుడ్‌ ప్రముఖులు రిషీకపూర్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు.

రిషి కూపూర్ లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్ రెండవ కుమారుడు. ఈయన 1952 సెప్టెంబ‌ర్ 4న మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించారు. న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అత‌నికి భార్య నీతూ సింగ్‌, పిల్ల‌లు రిద్దిమా క‌పూర్, ర‌ణ్‌భీర్ క‌పూర్ ఉన్నారు. ఇటీవ‌లి కాలంలో రిషీ క‌పూర్ ఎక్కువ‌గా సంచ‌ల‌న ట్వీట్స్‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతూ వ‌చ్చారు. ముక్కు సూటిగా మాట్లాడే ఆయ‌న ధోర‌ణి చాలా మందికి న‌చ్చుతుంది. ఇర్ఫాన్ ఖాన్ మరణం దేశానికి తీరని లోటు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తెలివైన నటుడిని కోల్పోయామన్న మహేష్ బాబు, ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే..

ఎన్నో అవార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకున్న రిషి క‌పూర్ అభిమానుల ప్రేమ‌ని అంత‌క‌న్నా ఎక్కువ‌గా పొందాడు. 1970లో మేరా నామ్ జోక‌ర్ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌రిచ‌య‌మైన రిషి క‌పూర్ ఈ చిత్రానికి గాను నేష‌నల్ అవార్డ్ అందుకున్నారు. ఇక 1973లో బాబీ అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించిన ఆయ‌న డింపుల్ క‌పాడియా స‌ర‌స‌న న‌టించాడు. ఈ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డ్ కూడా ద‌క్కింది . 1973-2000 మ‌ధ్య 92 సినిమాలు లీడింగ్ రోల్ చేశాడు.

అందులో చాలా చిత్రాలు బాక్సాఫీస్ హిట్ కొట్టాయి. ఇటీవ‌ల 102 నాటౌట్ అనే చిత్రంలో అమితాబ్‌తో క‌లిసి న‌టించారు రిషి. ఇందులో చిన్న‌పిల్ల‌లా న‌టించి అల‌రించారు. చివ‌రిగా ది బాడీ అనే చిత్రంలో న‌టించగా, శ‌ర్మాజీ న‌మ్‌కీన్ చిత్రం సెట్స్ పై ఉంది. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్‌, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్‌, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి.