Jr NTR Arrived India:ఆస్కార్ వచ్చిన విషయాన్ని మొదట తనకే చెప్పా: జూనియర్ ఎన్టీఆర్, ఆస్కార్ వేడుకల్లో పాల్గొని భారత్ చేరుకున్న యంగ్ టైగర్, ఆ క్షణం మరిచిపోలేదనన్న ఎన్టీఆర్

ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Actor Jr NTR) ఈ ఉదయం శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. RRR టీంలో సభ్యుడిని అయినందుకు గర్వంగా ఉందని, ఆస్కార్ అవార్టు (RRR won the #Oscar) ప్రకటించిన క్షణాన్ని మరిచిపోలేనన్నారు.

RRR Actor Jr NTR arrived India (PIC @ ANI News)

Hyderabad, March 15: భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన RRR చిత్ర బృందం ఒక్కొక్కరుగా ఇండియా చేరుకుంటున్నారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Actor Jr NTR) ఈ ఉదయం శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. RRR టీంలో సభ్యుడిని అయినందుకు గర్వంగా ఉందని, ఆస్కార్ అవార్టు (RRR won the #Oscar) ప్రకటించిన క్షణాన్ని మరిచిపోలేనన్నారు. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ ('Naatu Naatu' song from RRR won the Oscar) వచ్చిన విషయాన్ని మొదట తన భార్యకు ఫోన్ చేసి చెప్పానని అన్నారు. ఆనందక్షణాల్లో తన కంటి నుంచి నీరు వచ్చిందన్నారు. RRR మూవీని ఆదరించి, ఈ స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్క ఇండియన్ కు ధన్యవాదాలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లనే ఈ విజయం సాధ్యమైందన్నారు.

ఇక నాటు నాటు సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఆస్కార్ అందుకొని స్టేజి కిందకు వచ్చిన ఎంఎం కీరవాణి తనను హత్తుకున్న క్షణం జీవితంలో మరిచిపోలేనన్నారు. RRRను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడా మూవీ టీంపై చర్చ నడుస్తోంది. అందులో పనిచేసిన ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవుతున్నారు. కొద్దిరోజులుగా ఆస్కార్ వేడుకల కోసం RRR సభ్యుల బృందం అమెరికాలోనే ఉంది. వేడుకలు ముగియడంతో త్వరలోనే మిగిలిన సభ్యులు కూడా భారత్ రానున్నారు. వారికి గ్రాండ్ వెల్‌ కమ్ చెప్పేందుకు సినీ పరిశ్రమ ఎదురుచూస్తోంది.