Alexandra Djavi Dies: ప్రముఖ నటి ఆత్మహత్య, గోవాలో తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయిన కాంచన 3 హీరోయిన్ అలెగ్జాండ్రా జావి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ నెల 20న అలెగ్జాండ్రా జావు మృతదేహం (Alexandra Djavi found dead in Goa home) ఉత్తర గోవాలోని ఆమె గది పైకప్పుకు వేలాడుతూ కనిపించింది. రష్యా జాతీయురాలైన అలెగ్జాండ్రా (Russian model Kanchana 3 actress) వయసు 24 సంవత్సరాలు.

Image used for representational purpose | (Photo Credits: Pixabay)

సినీ నటి, మోడల్ అలెగ్జాండ్రా జావి గోవాలోని హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 20న అలెగ్జాండ్రా జావు మృతదేహం (Alexandra Djavi found dead in Goa home) ఉత్తర గోవాలోని ఆమె గది పైకప్పుకు వేలాడుతూ కనిపించింది. రష్యా జాతీయురాలైన అలెగ్జాండ్రా (Russian model Kanchana 3 actress) వయసు 24 సంవత్సరాలు. ఆమెది ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఆమె ప్రియుడు ఆమెను విడిచిపెట్టడం పాటు మనస్పర్థలు రావడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లినట్టు చెపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె బోయ్ ఫ్రెండ్ ను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు చెన్నైకి చెందిన ఫొటోగ్రాఫర్ పై 2019లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అతన్ని కూడా విచారించే అవకాశం ఉంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి, నటించిన 'కాంచన 3' చిత్రంలో అలెగ్జాండ్రా నటించింది. ప్రతీకారం తీర్చుకునే దెయ్యం పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ సినిమాలో ఒవియా, నిక్కీ తంబోలిలు ఇతర హీరోయిన్ల పాత్రలను పోషించారు.

ప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూత, సంతాపం తెలిపిన కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్పతో సహా పలువురు ప్రముఖులు, 500కు పైగా చిత్రాల్లో నటించిన జయంతి

కాగా 2019 లో చెన్నైలో ఫోటోగ్రాఫర్‌ లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఆమె ఫిర్యాదు చేసింది. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని గోవా పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. మెడికో ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి ప్రతినిధులను నియమించడానికి దర్యాప్తు అధికారులు ఇప్పటికే రష్యన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

2021 లో కోలీవుడ్ చాలా మంది ప్రముఖులను కోల్పోయింది. గత వారం, తమిళ VJ నటుడు ఆనంద కన్నన్ క్యాన్సర్ కారణంగా మరణించారు. అతని వయస్సు 48. కొన్ని రోజుల క్రితం, ప్రముఖ మలయాళ నటి చిత్ర చెన్నైలో తన నివాసంలో భారీ గుండెపోటుతో 56 సంవత్సరాల వయసులో మరణించింది. జిఎన్ రంగరాజన్, జి రామచంద్రన్, వెంకట్ సుభ, నెల్లై శివ, కెవి ఆనంద్, ఎస్ కె కృష్ణకాంత్, వివేక్ మరియు తెన్నరసు 2021 లో మరణించిన ప్రముఖ తమిళ ప్రముఖుల జాబితాలో ఉన్నారు.