Saaho Early Reviews: ప్రభాస్ ఆల్‌రౌండర్ షో! సాహో.. అదరహో!! 'సాహో' మూవీ ఫస్ట్ రివ్యూలు వచ్చేశాయి. ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే. ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా అవతరించబోతున్న ప్రభాస్.
దుబాయిలో ఆగష్టు 23నే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండటంతో 'సాహో' కు సంబంధించిన రిపోర్ట్స్ వెలువడ్డాయి....
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రచారాన్ని పొంది, అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' (Saaho) సినిమా ఆగష్టు 30న భారీ అంచనాల నడుమ విడుదలవుతుంది. ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులే కాదు, సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల వారు సాహో చిత్రం కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ ఇండియాలో ఒక స్టార్ హీరోగా ప్రభాస్ మారారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ప్రభాస్ స్టైలిష్ లుక్‌తో కనిపిస్తూ సినిమా రావడం. అందులోనూ ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు నటించటంతో సాహో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంత హైప్ క్రియేట్ చేసిన సాహో సినిమా తొలి రివ్యూలు దుబాయి నుంచి వచ్చేశాయి. దుబాయిలో ఆగష్టు 23నే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండటంతో 'సాహో' కు సంబంధించిన రిపోర్ట్స్ వెలువడ్డాయి. దుబాయిలో ఈ సినిమాను ఇప్పటికే చూసిన వారు సినిమాపై తమ స్పందన తెలియజేస్తున్నారు.
Saaho Reviews- సాహో విమర్శకుల రేటింగ్ 4/5
UAEకి చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు, దుబాయి సెన్సార్ బోర్డ్ సభ్యుడు అయిన ఉమేర్ సంధు ఈనెల 23నే 'సాహో' సినిమాను దుబాయిలో వీక్షించారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన సినిమాపై తన రివ్యూని తెలియజేశాడు. సాహోకు ఏకంగా 4/5 రేటింగ్స్ ఇచ్చారు. సాహో ఒక మాస్ ఎంటర్టైనర్ అని, ప్రభాస్ చేసే స్టంట్స్ ఒక రేంజ్ లో ఉన్నాయని చెప్పారు. ప్రభాస్ మరియు శ్రద్దా కపూర్ ల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ డైలాగ్స్ కి, స్క్రీన్ ప్లేకు లేచి చప్పట్లు కొడతాం అని చెప్పారు. ప్రభాస్ ఎంట్రీ, ఛేజింగ్ సీన్స్ అయితే ప్రేక్షకుల మతి పోగొడతాయని ఆయన చెప్పారు. సాహో సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెపుతూ, ఈ సినిమాతో ప్రభాస్ ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా అవతరించబోతున్నట్లు ఆయన చెప్పేశారు.
ఉత్కంట రేపే స్క్రీన్ ప్లే మరియు యాక్షన్ సన్నివేశాలు.
సినిమాపై ఎక్కడా పట్టుకోల్పోకుండా సాహోలో మంచి స్క్రీన్ ప్లే, యాక్షన్ సన్నివేశాలున్నాయని మరో ప్రేక్షకుడు తెలిపాడు.
ఫస్ట్ హాఫ్ యావరేజ్! ప్రభాస్ ఎంట్రీ, ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్ చివరి నిమిషాలు కేక.
RT @Eswargantaa: RT @Inside_Infos: >> Average 1st half
ఒక్కటే మాట.. తిరుగులేని బ్లాక్ బస్టర్.
రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో సాహో సినిమాను తెరకెక్కించారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో, ఛేజింగ్ సీన్లతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ ను తలపిస్తుంది. పెద్దగా అనుభవం లేకపోయినా డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశారని ప్రశంసలు వస్తున్నాయి. సాహోలో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు మరియు ప్రభాస్- శద్ధాల కెమిస్ట్రీలనే ప్రస్తావిస్తున్నారు. చివరగా చెప్పాలంటే సాహోకి నెగెటివ్‌గా ఇప్పటివరకు ఎలాంటి రివ్యూ రాలేదు. కొంతమంది మాత్రం ప్రభాస్ అక్కడక్కడా ఈ సినిమాలో విలన్ లాగా కనిపించడం నచ్చలేదని చెప్పారు. అయితే చాలా మంది మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా అని ప్రభాస్ రేంజ్‌కు ఎక్కడా తగ్గని సినిమా అని రివ్యూలు ఇచ్చారు.