Sarath Babu Movie Journey: మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు, శరత్ బాబు సినీ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు, దిగ్గజ నటుడు కన్నుమూతతో విషాదంలో టాలీవుడ్

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ 71వ ఏట తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.

Sarath Babu (Photo-Wikimedia)

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ 71వ ఏట తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 1951 జులై 31న ఆయన జన్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి 250కిపైగా సినిమాల్లో నటించారు. 70కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు.

కొంత కాలం క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు.. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల ఆరోగ్యం మళ్లీ దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు. అక్కడ ఆరోగ్యం కూడా మెరుగుపడన ఆసుపత్రి.. ఏప్రిల్ 20 హైదరాబ్‌లోని గచ్చిబౌలి ఏజీకి తీసుకొచ్చారు. అక్కడ కొన్ని రోజులు చికిత్స అందించిన వైద్యులు శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించిందని తేల్చారు. అది మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ కు దారి తీయొచ్చని చెప్పారు . వెంటిలేటర్ పైనే చికిత్స అందించారు. చివరి పరిస్థితి విషమించి మరణించారు.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు శరత్‌బాబు కన్నుమూత, AIG హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు..

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 1951 జూలై 31న శరత్ బాబు జన్మించారు. తన 22వ ఏట 1973లోనే నటుడిగా మారారు. రామరాజ్యం అనే చిత్రంలో తొలిసారిగా నటించారు. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.

మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాంధవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు. శరత్ బాబు మొత్తంగా 200 చిత్రాలకు పైగా నటించారు.

వీరు 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి సీతాకోక చిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు లభించాయి.

శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్ద, వీరి వివాహం పద్నాలుగేళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో తెలుగు సినిమా.కాం(https://telugucinema.com)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్ళిచేసుకుంటే, శరత్ బాబు అవసరానికి పెళ్ళిచేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి అని చెప్పింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now