Sitaramasastri No More: సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తిరిగిరాని లోకాలకు..లెక్కలేనన్ని అవార్డులు సొంతం చేసుకున్న సినీ గేయ రచయిత,
ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశ్రాస్త్రి తిరిగిరాని లోకాలకు (Sitaramasastri No More) వెళ్లిపోయారు
తెలుగు సిని పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశ్రాస్త్రి తిరిగిరాని లోకాలకు (Sitaramasastri No More) వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో జాయినయ్యారు. డాక్టర్లు ఆయన ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం (Sirivennela Sitarama Sastry died) దక్కలేదు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో (Kims Hospital) చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం కన్నుమూసినట్టు తెలుస్తుంది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు'ని చెబుతారు. శాస్త్రి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తిచేసారు.ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరుతోనే 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది.
సిరివెన్నెల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాలు అందుకున్న గీతాలు ఇవే
1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తెలుగు తెరపై అడుగు పెట్టారు సీతారామశాస్త్రి. మొదటి సినిమానే అతని ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు. అంతేకాదు ఆ సినిమాకు గాను ఉత్తమ గేయ రచయితగా అవార్డుని అందుకున్నారు. అలా మొదలైన సీతారాశాస్త్రి సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. 2019లో భారతదేశ పురస్కారం పద్మశ్రీ లభించింది. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
విధాత తలపున ప్రభవించినది... అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ధన మాయను ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవ మాయని కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల.
ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటలలో మచ్చుకు కొన్ని గుర్తు చేసుకుంటే:
1. సిరివెన్నెల లోని ప్రతి పాట అణిముత్యమే.
విధాత తలపున ప్రభవించినది
చందమామ రావే
ఆది భిక్షువు వాడినేది కోరేదీ
ఈ గాలీ ఈ నేలా
పాటల్లో పాడలేనిదీ
చినుకు చినుకు
మెరిసే తారలదే రూపం
పొలిమేర దాటిపోతున్నా
ప్రకృతి కాంతకు..
2. స్వయంకృషిలో పారాహుషార్
3. రుద్రవీణలోని నమ్మకు నమ్మకు ఈ రేయినీ, జాతీయ అవార్డు అందుకున్న లలిత ప్రియ కమలం విరిసినదీ,
తరలిరాద తనే వసంతం
చుట్టుపక్కల చూడరా
నీతోనే ఆగేనా సంగీతం
రండి రండి రండి
4. స్వర్ణకమలంలోని అన్ని పాటలు - ముఖ్యంగా : 'ఆకాశంలో ఆశల హరివిల్లూ ; 'అందెల రవమిది
5. శృతిలయలులో - తెలవారదేమో స్వామి
6. శివలో బోటని పాఠముంది
7. క్షణక్షణంలో కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా,
కో అంటే కోటి
అమ్మాయి ముద్దు ఇవ్వందే
అందనంత ఎత్తా తారాతీరం
8. గాయంలో అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు, రాష్ట్ర నంది అవార్డు సాధించిన స్వరాజ్యమవలేని
9. గులాబిలో ఏ రోజైతె చూశానో నిన్నూ, క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురూ
10. మనీలో చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ
11. శుభలగ్నం లోని చిలకా ఏ తోడు లేకా
12. నిన్నే పెళ్ళడతా లోని కన్నుల్లో నీ రూపమే, నిన్నే పెళ్ళాడేస్తానంటూ
ఎటో వెళ్ళిపోయింది
గ్రీకువీరుడు
కన్నులో నీ రూపమే
ఇంకా ఏదో
నాతోరా
13. సింధూరం లోని అన్ని పాటలు ముఖ్యంగా - సంకురాత్రి పండగొచ్చెరో, అర్థ శతాబ్దపూ
14. దేవీపుత్రుడు లోని ఓ ప్రేమా
15. చంద్రలేఖ లోని ఒక్క సారి ఒక్క సారి నవ్వి చూడయ్యో
16. నువ్వే కావాలి నుంచి ఎక్కడ ఉన్నా, కళ్ళలొకి కళ్ళు పెట్టీ
17. నువ్వు నాకు నచ్చావు నుంచి ఆకాశం దిగివచ్చి
18. శుభ సంకల్పం నుంచి హైలెస్సో, సీతమ్మ అందాలూ
19. పట్టుదల నుండి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
20. ఆదిత్య 369 నుండి జాణవులే నెరజాణవులే
21. కూలీ నెం.1 నుండి కొత్త కొత్తగా ఉన్నది
22. రౌడీ అల్లుడు నుండి చిలుకా క్షేమమా
23. అల్లరి ప్రియుడు నుండి అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
24. అంతం నుండి ఓ మైనా, నీ నవ్వు చెప్పింది నాతో
25. గోవిందా గోవిందా నుండి అమ్మ బ్రహ్మదేవుడో
26. శుభలగ్నం నుండి చిలక ఏ తోడు లేక
27. క్రిమినెల్ నుండి తెలుసా మనసా
28. మావిచిగురు నుండి మావిచిగురు తిని, మాట ఇవ్వమ్మా చెల్లి
29. పవిత్ర బంధం నుండి అపురూపమైనదమ్మ ఆడజన్మ
30. పెళ్లి నుండి జాబిలమ్మ నీకు అంత కోపమా
31. పెళ్ళి చేసుకుందాం నుండి నువ్వేమి చేసావు నేరం, ఎన్నో ఎన్నో ఇంకా ఎన్నో పాటలను అందించారు. అల వైకుంఠపురములో సామజవరగమన పాట కూడా సిరివెన్నల కలం నుండే జాలువారింది.
లెక్కలేనన్ని అవార్డులు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1986 - సిరివెన్నెల - విధాత తలఁపున...
1987 - శ్రుతిలయలు - తెలవారదేమో ...
1988 - స్వర్ణకమలం - అందెల రవమిది...
1993 - గాయం - సురాజ్యమవలేని...
1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక...
1995 - శ్రీకారం - మనసు కాస్త కలత...
1997 - సింధూరం - అర్ధ శతాబ్దపు...
1999 - ప్రేమకథ - దేవుడు కరుణిస్తాడని...
2005 - చక్రం - జగమంత కుటుంబం నాది...
2008 - గమ్యం - ఎంతవరకూ ఎందుకొరకూ...
2013 - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - మరీ అంతగా.. (నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు)
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, ఉత్తమ గేయరచయితగా :
2005 - నువ్వొస్తానంటే నేనొద్దంటానా -
2008 - గమ్యం - ఎంతవరకు...
2009 - మహాత్మ - ఇందిరమ్మ
2015 - కంచె
కళాసాగర్ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1986 - సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
1992 - అంకురం - ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
1995 - పెళ్ళి సందడి - హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా
మనస్విని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
1995 - పెళ్ళి సందడి - హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా
1998 - మనసిచ్చి చూడు - బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ!
1999 - అల్లుడుగారు వచ్చారు - నోరార పిలిచినా పలకనివాడినా, మనసున మమతలున్న మనిషినికానా
కిన్నెర పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1998 - మనసులో మాట - ఏరాగముంది మేలుకుని ఉండి లేవనంటుందా మనసుని పిలవగా
భరతముని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1992 - సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
1996 - పవిత్రబంధం - అపురూపమైనదమ్మ ఆడజన్మ - ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
1999 - భారతరత్న - మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!
అఫ్జా పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1999 - భారతరత్న - పారా హుషార్ భాయీ భద్రం సుమా సిపాయీ
2000 - నువ్వు వస్తావని - పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి
వంశీ బర్ఖిలీ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
2000 - నువ్వే కావాలి సినిమా గేయ రచయితగా :
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు
అనగనగా ఆకాశం వుంది - ఆకాశంలో మేఘం ఉంది
ఎక్కడ వున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి
రసమయి పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :
1988 - కళ్ళు - తెల్లారింది లెగండోయ్ కొక్క్కొరొక్కొ, మంచాలింక దింగండోయ్ కొక్క్కొరొక్కొ
బుల్లి తెర పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :
1999 - తులసి దళం, టి.వి. సీరియల్ - హాయిగా వుంది, నిదురపో
సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవిత విశేషాలు
సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినతేదీ 20 మే, 1955..
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జననం..
1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభం..
చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం..
కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాతో గుర్తింపు..
అదే సినిమా ఇంటిపేరుగా మారిపోయింది..
సిరివెన్నెల సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్న సీతారామశాస్త్రి..
దర్శకుడు కె.విశ్వనాధ్ తో అన్ని సినిమాలకు పనిచేసిన సిరివెన్నెల..
కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాడు..
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు..
రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీ కె.విశ్వనాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు..
2019లో పద్మశ్రీ వచ్చింది..
కెరీర్లో ఉత్తమ గేయరచయితగా 11 నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్..
ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశాడు..
త్రిబుల్ ఆర్ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి..
తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి పనిచేసిన సిరివెన్నెల..