Sitaramasastri No More: సిరివెన్నెల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ గేయ రచయితగా  నంది పురస్కారాలు అందుకున్న గీతాలు ఇవే
Sirivennela Sitaramasastri (Photo-Facebook)

తెలుగు సిని పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశ్రాస్త్రి తిరిగిరాని లోకాలకు (Sitaramasastri No More) వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో జాయినయ్యారు. డాక్టర్లు ఆయన ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం (Sirivennela Sitarama Sastry died) దక్కలేదు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో (Kims Hospital) చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం కన్నుమూసినట్టు తెలుస్తుంది.

సిరివెన్నెల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ గేయ రచయితగా  నంది పురస్కారాలు అందుకున్న గీతాలు ఇవే..

1986 – సిరివెన్నెల – విధాత తలపున…

1987 – శ్రుతిలయలు – తెలవారదేమో …

1988 – స్వర్ణకమలం – అందెల రవమిది…

1993 – గాయం – సురాజ్యమవలేని…

1994 – శుభలగ్నం – చిలకా ఏ తోడులేక…

1995 – శ్రీకారం – మనసు కాస్త కలత…

1997 – సింధూరం – అర్ధ శతాబ్దపు…

1999 – ప్రేమకథ – దేవుడు కరుణిస్తాడని…

2005 – చక్రం – జగమంత కుటుంబం నాది…

2008 – గమ్యం – ఎంతవరకూ ఎందుకొరకూ…