Sobhita Dhulipala Insta Post: ఎంగేజ్ మెంట్ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల తొలి పోస్ట్, నాగ‌చైత‌న్య గురించి ఎమోష‌న‌ల్ గా ఏం రాసిందో చూడండి

చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Sobhita Dhulipala Insta Post

Hyderabad, AUG 09: అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నెల 8న ఈ జంట అఫీషియల్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన జంటకు పలువురు సినీతారలు, అభిమానులు అభినందనలు తెలిపారు. తాజాగా ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని హీరో నాగార్జున తెలిపారు. విడాకుల అనంతరం చైతన్య చాలా బాధపడ్డారని వివరించారు. తన బాధను ఎవరితోనూ పంచుకోలేదని వెల్లడించారు. చైతూ సంతోషంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున వెల్లడించారు.