Nara Lokesh and Pawan Kalyan (Photo-X/TDP/Janasena)

Vjy, Jan 20: ఏపీలో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ని ఉపముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్లు టీడీపీ నేతల నుంచి ఊపందుకున్నాయి. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌ శ్రీనివాసులురెడ్డి కోరినప్పటి నుంచి ఆయనకు మద్ధతుగా చాలామంది తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ అలర్ట్ అయింది.

ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధికార ప్రతినిధులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. అనవసరమైన అంశాలపై మీడియా ముందు మాట్లాడవద్దని నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఏ అంశమైన కూటమి పక్షాల అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ పేర్కొంది. వ్యక్తిగత అభిప్రాయాలంటూ కొంతమంది మాట్లాడటంపై కూడా టీడీపీ హైకమాండ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన వర్మ, నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాల్సిందేనని డిమాండ్

కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ అధికార ప్రతినిధులకు సోమవారం ఫోన్లు చేసి మరీ స్పష్టం చేసింది. గత మూడు రోజుల నుంచి లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు వరుసగా విజ్ఞాపనలు చేస్తుండటంతో టీడీపీ హై కమాండ్ ఈ చర్యలకు ఉప క్రమించింది.మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధులు సయ్యద్‌ రఫీ, ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, ఆదిరెడ్డి వాసు వంటి వారు లోకేశ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.