Sridevi Death Case: అలనాటి హీరోయిన్ శ్రీదేవీ మృతి కేసు మళ్లీ తెరపైకి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన మహిళపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

శ్రీదేవి మరణంపై తాను సొంతంగా విచారణ జరిపానని, యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచినట్టు తేలిందంటూ నకిలీ పత్రాలు సృష్టించిన భువనేశ్వర్‌కు చెందిన దీప్తి పిన్నిటిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఫిర్యాదులో దీప్తి న్యాయవాది భరత్‌ సురేశ్‌ను కూడా చేర్చారు.

Sridevi (Photo Credits: X)

అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) మృతిపై నకిలీ పత్రాలు సృష్టించిన ఓ యూట్యూబర్‌పై సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. శ్రీదేవి మరణంపై తాను సొంతంగా విచారణ జరిపానని, యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచినట్టు తేలిందంటూ నకిలీ పత్రాలు సృష్టించిన భువనేశ్వర్‌కు చెందిన దీప్తి పిన్నిటిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఫిర్యాదులో దీప్తి న్యాయవాది భరత్‌ సురేశ్‌ను కూడా చేర్చారు.

ఈ విషయాన్ని సీబీఐ ఆదివారం వెల్లడించింది. ఈ పరిణామంపై దీప్తి స్పందించారు. తన వాంగ్మూలం నమోదు చేయకుండానే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు.తనపై మోపిన అభియోగాలకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు అందజేస్తానని చెప్పారు.

ఆ విషయంలో సిల్మ్‌ స్మితను కొట్టేవారే లేరు, అలనాటి శృంగార తారను పొగడ్తలతో ముంచెత్తిన హీరో బాలకృష్ణ, ఆదిత్య 369 సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనను గుర్తు చేసుకున్న బాలయ్య

శ్రీదేబి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దీప్తి చర్చలు జరిపారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి మరణంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేఖలతో పాటు సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్ల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి ఇవే సాక్ష్యాలు అంటూ ప్రదర్శించారు.

రంగంలోకి దిగిన సీబీఐ దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని తేల్చింది. ఇవన్నీ నకిలీ పత్రాలంటూ ముంబైకి చెందిన చాందినీ షా అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కాగా శ్రీదేవి 2018లో దుబాయ్‌లో చనిపోయిన విషయం తెలిసిందే.

ఈ అంశంలో దీప్తిపై గతేడాది సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. డిసెంబరు 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. దీప్తి ఫోన్, ల్యాప్‌టాప్ సహా పలు డిజిటల్ పరికరాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నటి శ్రీదేవి మరణంపై దీప్తి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, నకిలీ పత్రాలు సృష్టించారని కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది.