Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై రాజమౌళి సంచలన కామెంట్స్, చివరి 30 నిమిషాల సమయం నన్ను పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిందని వెల్లడి

తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న కల్కి... విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Cameo Appearance in Kalki

రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన కల్కి 2898 ఏడీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న కల్కి... విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో మూడు విభిన్న ప్రపంచాలను సృష్టించిన తీరును సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. తాజాగా, అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా కల్కి 2898 ఏడీ చిత్రంపై తన స్పందన తెలియజేశారు.

కల్కి 2898 ఏడీ రివ్యూ ఇదిగో, ప్రభాస్ కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్, హాలీవుడ్‌కి సవాల్ విసిరిన నాగ్ అశ్విన్, కురుక్షేత్ర సంగ్రామం నుంచి కలియుగం వరకు సినిమా..

"కల్కి 2898 ఏడీ చిత్రం ద్వారా మరో ప్రపంచానికి రూపం కల్పించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని అద్భుతమైన సెట్టింగ్ లు నన్ను వేర్వేరు కాలాలకు తీసుకెళ్లాయి. డార్లింగ్ (ప్రభాస్) తన టైమింగ్ తో, నటనా ప్రతిభతో చంపేశాడంతే! అమితాబ్ గారు, కమల్ సర్, దీపిక గొప్పగా నటించారు. ఈ సినిమాలో చివరి 30 నిమిషాల సమయం నన్ను పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇంతటి భారీ పనితనాన్ని కనబరిచే క్రమంలో అసమాన కృషి చేసిన దర్శకుడు నాగి (నాగ్ అశ్విన్), వైజయంతీ మూవీస్ బృందానికి శుభాభినందనలు" అంటూ రాజమౌళి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.