Sudigali Sudheer: చంద్రబాబు నాయుడును, చంద్రశేఖర్ రావుతో గుణిస్తే చందు. ఈ పేరు గల వారు చాలా తెలివైన వారట, ఆ డిటేల్స్ ఏంటో చూడండి

శివప్రసాద్ చివరగా నటించిన చిత్రం ఇదే. ఈ సినిమా చివరి దశలో ఉండగా ఆయన మరణించారు....

Software Sudheer Teaser Out | Photo - Sekhara Art Creations

టీవీ కామెడీ షో లలో 'జబర్ధస్త్' పేరు చెప్పగానే రోజా, నాగబాబు నవ్వులు గుర్తొస్తాయి. వీరితో పాటు సుడిగాలి సుధీర్ పేరు కూడా చాలా పాపులర్. తన స్టైల్ కామెడీతో, టైమింగ్‌తో స్మాల్ స్క్రీన్స్‌పై సుడిగాలి సుధీర్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు టీవీలో టాప్ రేటెడ్ ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్. యూట్యూబ్‌లో కూడా అతడి వీడియోస్‌కి లక్షల్లో వ్యూస్ వస్తాయి. వీటితో పాటు సుధీర్- రష్మిల లవ్ స్టోరీపై కూడా చాలా గాసిప్స్ ఇంటర్నెట్లో, టీవీల్లో హల్ చల్ చేస్తాయి. జబర్ధస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన సుధీర్ ఆ తర్వాత మిగతా షోలలో కూడా హోస్ట్ చేయడం ప్రాంభించాడు, ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చాడు.

సరే, ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? సుడిగాలి సుధీర్ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించాడు. అడ్డా, రేసుగుర్రం, సర్ధార్ గబ్బర్ సింగ్, నేను శైలజ ఇలా దాదాపు ఒక 20 సినిమాలకు పైగా నటించి ఉంటాడు. అయితే అవన్నీ చిన్న చిన్న రోల్స్, వాటితో పెద్దగా పేరేమి రాలేదు. సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తే సైడ్‌కు వాడుకొని వదిలేస్తున్నారనుకున్నాడో, ఏమో. ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమా పేరు 'సాఫ్ట్‌వేర్ సుధీర్' (Software Sudheer).  (విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా.. చాలు చాలు!)

అదీ, ఇదీ కాదు. అసలు ఆ న్యూస్ ఆర్టికల్ హెడ్‌లైన్ ఏంటి, దీనికి ఉన్న తంబ్‌నైల్ ఫోటో ఏంటి, లోపల జబర్ధస్త్ సుడిగాలి ఏంటి? అని మీకు అనిపించి ఉండొచ్చు. ఆ చంద్రబాబు, చంద్రశేఖర్ రావు కథేంటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

Software Sudheer Teaser:

ఇక, ఇటీవలే ఆనారోగ్యంతో కన్నుమూసిన చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ చివరగా నటించిన చిత్రం ఇదే. ఈ సినిమా చివరి దశలో ఉండగా ఆయన మరణించారు. ఇక ఈ సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలో సుధీర్ సరసన ధన్య బాలకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుంది.



సంబంధిత వార్తలు