MSME Fraud Case: చిక్కుల్లో హీరోయిన్ నమిత భర్త, నోటీసులు జారీచేసిన తమిళనాడు పోలీసులు

అతను తమిళనాడు సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల కౌన్సిలింగ్ డిపార్ట్‌మెంట్ లో చైర్మన్ పదవి ఇప్పిస్తానంటు గోపాల్ స్వామి అనే వ్యక్తి దగ్గర రూ. 50 లక్షల దాకా నగదు తీసుకున్నట్లు సమాచారం

Representational (Credits: Google)

సినినటీ నమిత భర్త వీరేంద్ర చౌదరి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అతను తమిళనాడు సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల కౌన్సిలింగ్ డిపార్ట్‌మెంట్ లో చైర్మన్ పదవి ఇప్పిస్తానంటు గోపాల్ స్వామి అనే వ్యక్తి దగ్గర రూ. 50 లక్షల దాకా నగదు తీసుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో అతన్ని మోసం చేసిన కేసులో నోటీసులు జారీ చేసారు. చౌదరిని విచారణకు హాజరు కావల్సిందిగా కోర్టు కోరడంతో.. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా సేలం సెంట్రల్ క్రైమ్ బ్రాంచి వారు నోటీసులు పంపించారని తెలుస్తుంది.

ముత్తురామన్ అనే వ్యక్తి చైర్మన్ పదవి ఇప్పిస్తానని అమ్మాపాళయం జాకీర్ ప్రాంతానికి చెందిన గోపాల్ స్వామి దగ్గర రూ.50 లక్షలు తీసుకున్నాడు. కానీ ఆ పదవిని వీరేంద్ర చౌదరి ఇటీవలే చేపట్టడంతో గోపాల్ స్వామి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో ఈ కేసులో ముత్తురామన్ తో పాటు తమిళనాడు కౌన్సిల్ డిపార్ట్ మెంట్ ప్రెసిడెంట్  దుశ్యంత్ యాదవ్ ను కూడా గత నెల అక్టోబర్ 31 న అరెస్ట్ చేసారు.

ఇదే సమయంలో తమిళనాడు కౌన్సిల్ విభాగ అధ్యక్షుడైన చౌదరితో పాటు ముత్తురామన్ సహాయకుడు, బీజేపీ రాష్ట్ర  మీడియా ఉపాధ్యక్షుడు మంజునాథ్ కూడా విచారణకు హాజరు కావాలంటూ సూరమంగళం పోలీసులు నోటీసులు జారీ చేసారు. అయినా వాళ్లిద్దరూ హాజరు కాలేదని తెలియడంతో.. పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.