Superstar Krishna Funeral: కాసేపట్లో పద్మాలయా స్టూడియోకు సీఎం వైఎస్ జగన్, సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పించనున్న ఏపీ ముఖ్యమంత్రి
కాసేపట్లో పద్మాలయా స్టూడియోకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేరుకుని కృష్ణకు నివాళుల అర్పించనున్నారు.
నటశేఖరుడు, తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM Jagan) హైదరాబాద్ వెళ్లారు. కాసేపట్లో పద్మాలయా స్టూడియోకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేరుకుని కృష్ణకు నివాళుల అర్పించనున్నారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియోస్‌లో కృష్ణ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కృష్ణ ఆదివారం సాయంత్రం గుండెపోటుకి గురికాగా.. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన్ని కుటుంబ సభ్యులు చేర్చారు.సోమవారం సాయంత్రం ఆయన పరిస్థితి విషమించగా.. మంగళవారం వేకువ ఝామున నాలుగు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమాన గణం, యావత్ తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది.
బుధవారం తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణకు అంత్యక్రియలు (Superstar Krishna Funeral) జరుగుతాయి. ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు పద్మాలయా స్టూడియోలో ఆయన భౌతిక కాయన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు.