Kamal Haasan: కమల్ హాసన్‌పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం, కరోనా మార్గదర్శకాల ఉల్లంఘనపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ నోటీసులు

అయితే ఈ ప్రముఖ నటుడు (Kamal Haasan) కోలుకున్న వెంటనే హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం (TN Govt) ఆగ్రహం వ్యక్తం చేసింది.

File image of MNM chief Kamal Haasan | (Photo Credits: ANI)

ఈ మధ్య కమల్ హాసన్ కరోనా బారినపడి కోలుకున్న సంగతి విదితమే. అయితే ఈ ప్రముఖ నటుడు (Kamal Haasan) కోలుకున్న వెంటనే హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం (TN Govt) ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే బహిరంగ ప్రదేశాలకు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కమల్ తన చర్యలపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ నోటీసులు (Tamil Nadu Health Department ) జారీ జారీ చేసేందుకు సిద్ధమైంది. ఇది కరోనా మార్గదర్శకాల ఉల్లంఘనే అని, బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రముఖులే ఇలా ప్రవర్తిస్తే ఎలా? అంటూ అసహనం వెలిబుచ్చింది.

గత నెల 22న కమల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆపై ఆసుపత్రిలో చేరిన ఆయన డిసెంబరు 4న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆయన బిగ్ బాస్ షోకి వెళ్లడంపై ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వ నియమావళి ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి. ఈ విషయంలో కమల్ నిబంధనలు ఉల్లంఘించారని తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ జే.రాధాకృష్ణన్ పేర్కొన్నారు.