Sad songs in Telugu: ప్రేమించిన వారే మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, కానీ ఈ పాటలు బాధలో ఉన్న మిమ్మల్ని ఓదారుస్తాయి.
మనం ప్రేమించిన వ్యక్తులు దూరం అవుతున్నపుడు కలిగే బాధ గుండెల్ని పిండేసినట్టు అనిపిస్తుంది. వారితో గడిపిన క్షణాలు, వారి జ్ఞాపకాలు పదేపదే గుర్తుకొస్తాయి. అలాంటి సమయంలో కొన్ని పాటలు వింటే మానసికంగా మనల్ని ఎవరో ఓదారుస్తున్నట్లు ఒక ఫీలింగ్ కలుగుతుంది..
ప్రేమ ఎంత అందంగా ఉంటుందో, ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఆ జీవితం అంతకంటే భారంగా అనిపిస్తుంది. ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత నిన్నటి వరకు మన సొంతం అనుకున్న వాళ్లు ఒక్కసారిగా పరిచయం లేని వ్యక్తులుగా మారిపోతారు. మనం ఇష్టపడిన వాళ్లు మనకు దూరం అవుతున్నపుడు కలిగే బాధ గుండెల్ని పిండేసినట్టు అనిపిస్తుంది. వారితో గడిపిన క్షణాలు, వారి జ్ఞాపకాలు గుర్తుకొచ్చిన ప్రతీసారి కలిగే బాధకు మనకు తెలియకుండానే గుండె లోతుల్లోంచి వచ్చే కన్నీళ్లే సమాధానం అవుతాయి. వారితో కలిసి ఊహించుకున్న అందమైన కలల ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైనట్లు అనిపిస్తుంది.
ఒక్కోసారి ఈ బాధను ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అనేలా మనసులో తీవ్రమైన భావోద్వేగాలు మొదలవుతాయి అలాంటి సమయంలో కొన్ని పాటలు వింటే మానసికంగా మనల్ని ఎవరో ఓదారుస్తున్నట్లు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అలా తెలుగులో వచ్చిన కొన్ని బ్రేకప్ సాంగ్స్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. అవేంటో ఒకసారి చూడండి, అంతకంటే ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది.. జీవితం అనే సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది కలుస్తుంటారు, ఎంతో మంది విడిపోతుంటారు. కాలం గడిచే కొద్ది వాటికి సమాధానాలు దానంతటవే వస్తాయి, కాబట్టి జీవితం అనే ప్రయాణాన్ని ఎక్కడా ఆపకూడదు.
Nee Selavadigi.. Janatha Garage
Yekkada Yekkada (Sad).. - Nenu Local
Selavanuko..- Heart Attack
Breakup Song.. - Arjun Reddy
Tholi Premaa.. - Tholi Prema
Adiga Adiga.. - Ninnu Kori
Yellipoke Syamala.. - A Aa
Em Cheppanu.. - Nenu Sailaja
Atu Nuvve Itu Nuvve.. - Current
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)