Uttej Wife Padmavati Dies: క్యాన్సర్‌తో పోరాడుతూ నటుడు ఉత్తేజ్‌ భార్య పద్మావతి మృతి, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస (Uttej Wife Padmavati Dies) విడిచారు.

Tollywood Actor Uttej wife Padmavati passed away (Photo-Twitter)

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస (Uttej Wife Padmavati Dies) విడిచారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు.

ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌ (Tollywood Actor Uttej), ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్‌రాజ్‌, జీవిత రాజశేఖర్‌ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ని పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నాం మహ్రాపస్థానంలో పద్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తేజ్‌ చిరంజీవి పట్టుకుని కన్నీటి పర్యంతరం అయిన దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి.