Raghavendra Rao

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘సీతారామం, బింబిసార, కార్తికేయ 2’ వంటి సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇక వినోదాత్మకంగా రూపొందిన మా ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ చిత్రం కూడా ఈ చిత్రాల్లానే విజయం సాధిస్తుంది’’ అని ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు (Director Raghavendra Rao) అన్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer)ప్రధాన పాత్రల్లో శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’. కె. రాఘవేంద్రరావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది.

ప్రభాస్ స‌లార్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది, సెప్టెంబ‌రు 28న చిత్రాన్ని విడుద‌ల చేయనున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. అయితే ఆ సమయంలో అనసూయ మాట్లాడుతుండగా సుడిగాలి సుధీర్‌ స్టేజ్‌పైకి వచ్చాడు. అతన్ని చూడగానే ఫ్యాన్స్‌ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. స్వయంగా రాఘువేంద్ర రావు మైక్‌ తీసుకొని సైలెంట్‌గా ఉండాలని కోరినా సుధీర్‌ ఫ్యాన్స్‌ వినిపించుకోలేదు. దీంతో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. సుధీర్‌ సహా అందరూ మాట్లాడుతారని, కాస్త ఓపిగ్గా ఉండాలని కోరారు. పిచ్చిపిచ్చిగా ఉందా? ఎవరు పిలిచారు వాళ్లని? పెద్దా చిన్నా తేడా లేదా? ఇలాగే ప్రవర్తిస్తే బయటకు పంపించేస్తా అంటూ సీరియస్‌ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధిం‍చిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.



సంబంధిత వార్తలు

Latest OTT Releases This Week: ఒక్క రోజే 10 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్, ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేసుకోండి

This Week Movies- OTT Releases: ఈ నెల 26 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో టిల్లూ స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్, ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు ఇవిగో,,

Maa Elections: హ‌డావుడి లేకుండా సైలెంట్ గా పూర్త‌యిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు, పాత కార్య‌వ‌ర్గాన్నే ఏక‌గ్రీవంగా ఎన్నికున్న స‌భ్యులు

Pushpa 2 – The Rule: మాస్ జాత‌ర‌కు బీ రెడీ! అల్లు అర్జున్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా క్రేజీ అప్ డేట్ ఇవ్వ‌నున్న పుష్ఫ‌-2 మూవీ టీం, మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్వీట్ చేసిన పోస్ట‌ర్ చూసేయండి!

Karthika Deepam Pre Release: సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన వంటలక్క, తెలుగు సీరియల్స్ చరిత్రలో తొలిసారి ఆ క్రెడిట్ దక్కించుకుంటున్న కార్తీకదీపం సీరియల్

This Week Movies- OTT Releases: నేడే చూడండి..! హనుమాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది, ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

Maha Shivratri Week Movies- OTT Releases: హనుమాన్ ఓటీటీపై తాజా అప్‌డేట్ ఏమిటి, విశ్వక్ సేన్ గామి, గోపిచంద్ భీమా రివ్యూలు ఎలా ఉన్నాయి, శివరాత్రి సందర్భంగా ఈవారం కొత్త చిత్రాల విశేషాలు తెలుసుకోండి!

Anil Kapoor on Tollywood: తెలుగు సినిమాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు