స‌లార్‌ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. పార్ట్ 1 సెప్టెంబ‌రులో వ‌స్తోంది కాబ‌ట్టి.. పార్ట్ 2ని 2024 వేస‌విలో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. 2023లోనే ‘ప్రాజెక్ట్ కె’ కూడా విడుద‌ల అవుతుంద‌ని అశ్వ‌నీద‌త్ తెలిపారు. అయితే.. ఈ రిలీజ్‌డేట్ చూస్తుంటే.. `ప్రాజెక్ట్ కె` ఇంకాస్త ఆల‌స్యం అవుతుందేమో అనిపిస్తోంది. స‌లార్ వ‌ర‌కూ అయితే… రెండు భాగాల‌కూ సంబంధించిన షూటింగ్ ఈ యేడాది చివ‌రికి పూర్త‌వుతుంద‌ని చెప్పారు. అయితే.. సినిమా సెప్టెంబ‌రులోకి వెళ్లిపోయింది కాబ‌ట్టి.. షూటింగ్ పూర్త‌వ్వ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టేట్టే క‌నిపిస్తోంది. మొత్తానికి స‌లార్‌కి సంబంధించిన రిలీజ్ డేట్ విష‌యంలో క్లారిటీ అయితే వ‌చ్చేసింది. ఇక ఆది పురుష్‌, ప్రాజెక్ట్ కె లెక్క‌లే తేలాలి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)