Valmiki: పెద్దోళ్ల్ చెప్పిర్రు.. ఏం చెప్పిర్రు? ఆల్ట్రా మాస్ 'వాల్మీకీ' టీజర్ చూస్తే తెలుస్తుంది. ఎంతటి విలన్స్ అయినా బెదిరిపోయేంతలా ఉన్న వరుణ్ తేజ్ లుక్!

తొలిప్రేమ సినిమాలో లవర్ బాయ్‌గా కనిపించిన వరుణ్ తేజ్, ఈ సినిమాలో పూర్తిగా భిన్నంగా ఆల్ట్రా‌మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు...

Varun Tej's rugged look in Valmiki movie| Teaser out now| Photo: 14 Reels Plus

మెగా హీరో వరుణ్ తేజ్ ఇంతకుముందెప్పుడు చూడని సరికొత్త అవతారంలో 'వాల్మీకి' సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను హరీష్ శంకర్ చాలా పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 'వాల్మీకి' టీజర్ విడుదల చేశారు.

ఈ టీజర్ చూస్తే ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. తొలిప్రేమ సినిమాలో లవర్ బాయ్‌గా కనిపించిన వరుణ్ తేజ్, ఈ సినిమాలో పూర్తిగా భిన్నంగా ఆల్ట్రా‌మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. టీజర్‌ను బట్టి చూస్తే వరుణ్ లుక్‌కి విలన్స్ కూడా బెదిరిపోయేంతలా ఒక రఫ్‌గా  ఉన్నాడు.

"అందుకే పెద్దోళ్ల్ చెప్పిన్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే.. రెండు కాల్చుకోవాలె.. రెండు దాచుకోవాలె.." అనే డైలాగ్ డైనమిక్‌గా ఉంది.

తమిళ సినిమా 'జిగర్తాండా'కు రీమేక్‌గా వస్తున్న ఈ వాల్మీకి సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్. తమిళ యాక్టర్ అధ్వర్య మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ డెరెక్టర్, గోపి ఆచంట నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా దాదాపు పూర్తయింది. వచ్చేనెల సెప్టెంబర్  13న విడుదల చేయాలని ప్రణాళిక వేసుకుంటున్నారు.