Vijay Antony: అప్పుడు తండ్రి, ఇప్పుడు కూతురు, జీవితంలో ఎంతటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోకండి, కంటతడి పెట్టిస్తున్న హీరో విజయ్ ఆంటోని మాటలు

అయితే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ తీవ్రంగా కలచివేచే విషయం. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది.

Vijay Antony (Photo-X)

నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ విజయ్‌ ఆంటోని ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుందని తెలిసిందే.విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోని (Meera Antony) మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని (Chennai) డీడీకే రోడ్‌లోని తమ నివాసంలో ప్రాణాలు కోల్పోయింది. ఓ ప్రైవేటు పాఠశాలలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్న 16 ఏండ్ల మీరా చదువుల్లో ఒత్తిడి నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. కూతురు ఆకస్మిక మరణంతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది.

‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట విషాదం.. నటుడి కుమార్తె మీరా సూసైడ్.. కుమార్తె ఆత్మహత్య సమయంలో ఇంట్లో లేని విజయ్

విజయ్‌ ఆంటోనీ ఏడేండ్ల వయస్సులోనే తన తండ్రిని కోల్పోయాడు. అయితే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ తీవ్రంగా కలచివేచే విషయం. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది.

Here's Video

జీవితంలో ఎంతటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్యలు చేసుకోకండి. ఆత్మహత్య చేసుకున్న వారి పిల్లల గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నాకు ఏడేళ్లు. మా చెల్లికి ఐదేళ్లు. అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీకు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ నాన్న వెళ్లిపోయాక మమ్మల్ని పెంచేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అందుకే ఆత్మహత్యల గురించి విన్నప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే పలు సంక్షోభాల లోతు నాకు తెలుసు.. అంటూ విజయ్‌ ఆంటోనీ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య

Keerthy Suresh Lip Lock: కీర్తి సురేష్ లిప్ లాక్, పెళ్లైన మూడు రోజుల‌కే సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన న‌టి, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలివిగో..

SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్‌ నెంబర్‌ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి