Rama Rao On Duty leaked: రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో రవితేజ మూవీ క్లిప్పింగ్స్, రవితేజకు షాక్ ఇచ్చిన లీకర్స్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పవర్‌ఫుల్ సీన్‌

రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని పలు సీన్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులు టెన్షన్ పడుతున్నారు.

Hyderabad, July 29: మాస్ రాజా రవితేజ (Raviteja)నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao on duty) ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ మధ్య రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్’కు గట్టి షాక్ తగిలింది. ఈ సినిమా నుండి ఓ వీడియో సీన్ సోషల్ మీడియాలో(Social media) ప్రత్యక్షం కావడంతో రామారావు ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని పలు సీన్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. రిలీజ్‌కు ముందు రోజు ఇలా తమ సినిమాలోని సీన్స్ లీక్ (scene leaked) కావడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సీన్ ను చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అంత క్లారిటీగా లేకపోయినప్పటికీ, రవితేజ మాత్రం పవర్ ఫుల్ డైలాగ్ చెప్తున్నారు. ప్రస్తుత రాజకీయాలపై సెటైరికల్‌ గా ఈ డైలాగ్ ఉంది.

ఇక ఈ సీన్స్ ఖచ్చితంగా ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అయినట్లుగా వారు చెబుతున్నారు. అయితే ఈ వీడియో సీన్స్ ఎవరు లీక్ చేశారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి లీకులు కావడంతో చిత్ర యూనిట్ పోలీసులను ఆశ్రయించేందుకు రెడీ అయ్యింది.

Prem Chopra: స్టార్ నటుడిని బతికుండగానే చంపేశారు, నేను బతికున్నానంటూ మొరపెట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రేమ్ చోప్రా, తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన   

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా, సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.