Bad Boy Song from Saaho: 'బేబీ ఐయామ్ ఎ బ్యాడ్ గాయ్, కేన్ యూ బీ మై బ్యాడ్ గాల్'! సాహో నుంచి పార్టీ సాంగ్ విడుదల. బ్యాడ్ బాయ్ స్వరాలు వింటే నరాల్లో కరెంట్ పాస్ అవడం పక్కా!

ఆ తర్వాత విడుదలైన 'నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే' అంటూ సాగే మెలడీ సాంగ్ కూడా మంచి క్రేజ్ కొట్టేసింది. ఇప్పుడు 'బ్యాడ్ బాయ్' రాకింగ్ నెంబర్ కూడా యూత్‌ను షేక్ చేయడం గ్యారెంటీ.

Bad Boy song from Saaho is here. (Photo Credits: T-Series)

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సాహో' సినిమాలోంచి 'బ్యాడ్ బాయ్' స్పెషల్ సాంగ్ విడుదలైంది. బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ పాటలో ప్రభాస్‌తో కలిసి స్టెప్స్ వేసింది. ఈ పాటలో ప్రభాస్ నిజంగా బ్యాడ్ బాయ్ అనిపించుకునేలా చుట్టూ అమ్మాయిలతో, లవర్ బోయ్‌లా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. పాటలోని తెలుగు - ఇంగ్లీష్ లిరిక్స్ నరాల్లో కరెంట్‌ను పాస్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఆస్ట్రియా దేశంలో మంచి మంచి లోకెషన్లలో చాలా కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఈ పాట చిత్రీకరణ జరిపారు. సాహో నుంచి విడుదలైన మూడో సాంగ్ ఇది. అంతకుముందు విడుదలైన 'సైకో సయాన్' పాట కూడా యూత్‌లో వైబ్రేషన్ పుట్టించింది.

ఆ తర్వాత విడుదలైన 'నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే' అంటూ సాగే మెలడీ సాంగ్ కూడా మంచి క్రేజ్ కొట్టేసింది. ఇప్పుడు 'బ్యాడ్ బాయ్' రాకింగ్ నెంబర్ కూడా యూత్‌ను షేక్ చేయడం గ్యారెంటీ. ఇప్పటివరకూ విడుదల చేసిన మూడు పాటలకు ముగ్గురు వేర్వేరు మ్యూజిక్ కంపోజర్లు మ్యూజిక్ ఇచ్చారు. గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సాహో సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిషోర్, మందిరా బేడి, మహేష్ మాంజ్రేకర్లతో పాటు మరెంతో మంది బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నాడు. హైయాక్షన్, ఎంటర్టైన్మెంట్‌తో రాబోతున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆగష్టు 30న సాహో విడుదల కాబోతుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif