YouTuber Local Boy Nani (Photo-X)

విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నానిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే.తాజాగా యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించింది కోర్టు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.

యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పై 111(2) చీటింగ్, 112(1)పెట్టీ కేసు, 318(4) ఎలక్ట్రానిక్ పోర్జరీ, 319(2) పర్సనల్ చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66 C, 66D, AP గేమింగ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ నెల 21వ తేదీన యూట్యూబర్ నానిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు.. కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలోనే.. యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి రిమాండ్ విధించింది కోర్టు. 21వ తేదీన యూట్యూబర్ నానిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు.

యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు కేసు!

కాగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్పై TGSRTC ఎండీ సజ్జనార్ ఫైర్ అయిన సంగతి విదితమే. 'డబ్బు సంపాదించుకునేందుకు అనేక మార్గాలున్నాయి. ఇవేం దిక్కుమాలిన పనులు. మీ టాలెంట్‌ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోండి. ఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సు కోసం ఈ ప్రమోషన్లను ఆపండి' అని సూచించారు.