YouTuber Local Boy Nani Arrest for Promoting Betting Apps

Vij, Feb 23:  యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు నానిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు(Local Boy Nani Arrest). నాని బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంపై Xలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్(Sajjanar). సజ్జనార్ పోస్టుతో లోకల్ బాయ్ నాని కదలికలపై నిఘా పెట్టారు.

ఇక విమర్శలు రావడంతో ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటున్న ఆన్ లైన్ బెట్టింగ్ ను(Online Betting Apps) ఇక నుంచి ప్ర‌మోట్ చేయ‌న‌ని నాని ప్ర‌క‌టించి వీడియో సైతం రిలీజ్ చేశారు. దీనిని సజ్జనార్ సైతం అభినందించిన సంగతి తెలిసిందే.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తితో స్పందించిన లోకల్ బాయ్ నాని.. ఇకపై ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయనని వెల్లడి, సజ్జనార్ హర్షం

ఇక అంతకముందు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ నాని వీడియో రిలీజ్ చేయడంపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు(Promoting Betting Apps

).  మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇవేం దిక్కుమాలినపనులు అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

మీ టాలెంట్ ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవడంలో తప్పులేదు. అలా చేస్తే మిమ్మల్ని సమాజం హర్షిస్తోంది..ఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి అని సూచించారు.

YouTuber Local Boy Nani Arrest for Promoting Betting Apps

యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్..!

సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లమని, మేం ఏం చేసిన నడుస్తుందనే భ్రమలో ఉండకండి. చట్టప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి... ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లను ఆపండని సజ్జనార్ కోరిన సంగతి తెలిసిందే.