కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్‌ల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ నేపథ్యంలో యువతలో అవేర్‌నెస్ తీసుకువస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar). ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటున్న ఆన్ లైన్ బెట్టింగ్ ను ఇక నుంచి ప్ర‌మోట్ చేయ‌న‌ని నాని(Youtuber Local Boy Nani) ప్ర‌క‌టించడం అభినంద‌నీయం అన్నారు.

ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన సజ్జనార్.. మిగ‌తా సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లు కూడా నాని లాగే స‌మాజ శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని ఇక నుంచైనా బెట్టింగ్ యాప్ ల‌ను(Online Betting Apps) ప్ర‌మోట్ చేయ‌డం ఆపాలని సూచించారు. మేం అలానే చేస్తాం.. మా ఇష్టం అనుకుంటే మీపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని హెచ్చరించారు.

బిర్యానీ తిని డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి.. లాలాగూడలో ఘటన, హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు, వీడియో ఇదిగో

బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. హైదరాబాద్(Hyderabad) - లాలాగూడ లోని సూపర్ స్టార్ హోటల్ లో బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)