Telugu Girls In Bollywood: బాలీవుడ్ లో అదరగొడుతున్న తెలుగు అమ్మాయిలు!

బాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలా? ఇందెం కొత్త కాదె ఇంతక ముందు చాలా మందే నటించారు కదా? జయ సుధా, జయ ప్రధా, శ్రీ దేవి, రమ్య కృష్ణ, రంభ, రాసి, సౌందర్య, కాంచ్చన ఇంకా మొదలగు వారు నటించారు కదా అనిపించొచ్చు! నిజమే కానీ అక్కడకి తెలుగు అమ్మాయిలు వెళ్లడం చాలా అరుదు. అడపా దడపా ఒకటి రెండు చిత్రాల్లో నటించినా అక్కడ సెటిల్ అయిన వాళ్ళని వేళ్ళ ఫై లెక్కపెట్టొచ్చు. హీరోలే బాలీవుడ్లో నిలబడలేకపోతున్నపుడు హీరోయిన్ల పరిస్థితి అర్థo  చేసుకోండి.

ఇటీవల అలా అక్కడికి వెళ్లి తమ ఉనికిని చాటుకుo టున్న తెలుగు  అమ్మాయిల గురించే ఈ ఆర్టికల్.

శోభిత దూళిపాళ్ల :

శోభితా ధూలిపాలా, ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన అమ్మాయి. తాను నటి మరియు మోడల్. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో రెండవ స్థానంలో నిలిచింది, మరియు మిస్ ఎర్త్ 2013 లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది.

అనురాగ్ కశ్యప్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) లో ధూలిపాల నటించింది. ఇటీవల ఆమె అడవి శేష్ సరసన తెలుగు చిత్రం గుడాచారి (2018) లో కనిపించింది.

ప్రస్తుతం తను అమెజాన్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019), మూతోన్ దగ్గెర్ (మలయాళం, హిందీ), బేర్ అఫ్ బ్లడ్ (నెట్ఫ్లిక్) లలో బిజీగా వుంది.

స్వర భాస్కర్:

 తను హిందీ చిత్రాలలో ప్రధాన సహాయ నటి. ఆమె రెండు స్క్రీన్ అవార్డులను కూడా గెలుచుకుంది మరియు మూడు సందర్భాలలో ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికైంది.

ఇటీవల తన సోదరుడు ఇషాన్ భాస్కర్‌తో కలిసి బాలీవుడ్లో తన సొంత నిర్మాణ సంస్థ "కహానివాలీ" ని ప్రారంభించింది.

స్వరా భాస్కర్ తెలుగు భారత నావికాదళ అధికారి చిత్రపు ఉదయ్ భాస్కర్ మరియు బిహారీ వనిత ఇరా భాస్కర్ల కూతురు. వారు చదువుకునే రోజుల్లో ప్రేమ వివ్వాహం చేసుకొని న్యూ ఢిల్లీలో సెటిల్ అయ్యారు.

ఐశ్వర్య రాజేష్:

ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటించే ఐశ్వర్య ఇటు తెలుగు, మలయాళ చిత్రాలలో కూడా కనిపిస్తోంది.

సన్ టివిలో అసతాపోవాదు యారు అనే ప్రసిద్ధ కామెడీ షోలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది ఆమె. రియాలిటీ షో మనాడ మాయిలాడ గెలిచిన తరువాత. ఆమె నీథనా అవన్ (2010) చిత్రంలో అడుగుపెట్టింది మరియు అమూధా పాత్రను పోషించిన అట్టాకతి (2012) లో నటించిన తరువాత బాగా పాపులర్ అయ్యింది.

ఆమె మొట్టమొదటి మలయాళ చిత్రం దుల్కర్ సల్మాన్ సరసన "జోమొంటే సువిషేశంగల్" మరియు ఆమె రెండవ మలయాళ చిత్రం "సఖావు" లో నివిన్ పౌలీతో కలిసి నటించింది.

ఆమె 2017 లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అర్జున్ రాంపాల్ సరసన "డాడీ" చిత్రం ద్వారా మరియు ధనష్ మరియు విక్రమ్ సరసన "వాడా చెన్నై" మరియు "ధ్రువా నాట్చాటిరామ్" అనే రెండు పెద్ద చిత్రాలలో నటించింది.

తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో 2014 చిత్రం "కాకా ముత్తై" కి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని కూడా అందుకుంది.