Bigg Boss OTT Telugu: మొదలైన బిగ్‌ బాస్ తెలుగు ఓటీటీ, కంటెస్టెంట్ల ఫుల్ లిస్ట్ ఇదే! అన్ని సీజన్లలోని కంటెస్టెంట్లనే తిరిగి తెచ్చిన బిగ్ బాస్, ఒకరిద్దరు కొత్త మొహాలకు చోటు

తెలుగు బిగ్ బాగ్ ఓటీటీ (Bigg Boss Telugu OTT ) మొదలైంది. నో కామా...నో ఫుల్ స్టాప్ అంటూ బిగ్ బాస్ ఓటీటీని మొదలు పెట్టారు కింగ్ నాగార్జున(Nagarjuna). ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో (Disney+ Hotstar) ఈ షో ప్రసారం మొదలైంది

Hyderabad, Ferb 26: తెలుగు బిగ్ బాగ్ ఓటీటీ (Bigg Boss Telugu OTT ) మొదలైంది. నో కామా...నో ఫుల్ స్టాప్ అంటూ బిగ్ బాస్ ఓటీటీని మొదలు పెట్టారు కింగ్ నాగార్జున(Nagarjuna). ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో (Disney+ Hotstar) ఈ షో ప్రసారం మొదలైంది. ముందుగా షో హోస్ట్ నాగార్జున ఎంట్రీ అదిరింది. అమ్మాయిలంతా వెళ్లి వెల్కమ్ చెప్పడం.. నాగ్ స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ నుండి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన నాగ్ హౌస్ మొత్తం తిప్పి చూపించాడు. హౌస్ రెయిన్ బో లా కలర్ ఫుల్ గా వుందని హోస్టింగ్ ఇక్కడి నుంచే చేస్తే బాగటుందనిపిస్తుందని నాగార్జున అనగానే.. బిగ్ బాస్.. నాగార్జున ఇది నా అడ్డా.. అనడంతో నాగ్ హౌస్ వదిలి స్టేజ్ మీదకి వచ్చేశాడు. స్టేజి మీదకి వచ్చిన నాగ్ ఒక్కొక కంటెస్టెంట్ పరిచయం.. వాళ్ళని హౌస్ లోకి పంపించాడు.

హౌస్ లోకి తొలి కంటెస్టెంట్ గా డబ్‌స్మాష్‌తో ఫేమస్‌.. టిక్‌టాక్‌తో మరింత పాపులర్‌.. బిగ్‌బాస్‌ షోతో ఊహించని క్రేజ్‌ దక్కించుకున్న అషూ రెడ్డి (Ashu reddy) ఎంట్రీ ఇచ్చింది. గతంలో బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్న అషూ ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగి ఇప్పుడు ఇలా ఎంట్రీ ఇచ్చింది.

బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొన్న మహేశ్‌ విట్టాకు (Mahesh vitta) ఓటీటీ తొలి సీజన్ లో రెండో కంటెస్టెంట్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడొచ్చిన మహేశ్‌ విట్టాకు జల్లికట్టులో ఎద్దు మాదిరిలా గుద్దుకుంటా పోతాడంతే.. బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ అని చెప్పుకొచ్చాడు మహేశ్‌. అనంతరం మూడవ కంటెస్టెంట్ గా బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో అడుగుపెట్టి వివాదాలతో, గొడవలతో సంచలనంగా మారిన ముమైత్‌ (mumaith khan) మరోసారి ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.

Poonam Kaur: బావ సినిమా సూపర్ హిట్! మరోసారి రచ్చ రేపిన పూనమ్ కౌర్ పోస్ట్, సినిమా పేరు చెప్పకుండా పోస్ట్ చేసిన పూనమ్, మాకు తెలుసులే అంటున్న ఫ్యాన్స్

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి. కానీ ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. తానే దర్శకుడిగా మరి ఓ కొత్త సినిమా చేస్తున్న అజయ్‌ కాతువాయూర్‌ (ajay kathurvar) నాల్గవ కంటెస్టెంట్ గా.. రాయలసీమలోని మారుమూల గ్రామమైన కదిరి నుంచి వచ్చి యాంకర్‌ గా.. సోషల్ మీడియా స్టార్ గా ఎదిగిన స్రవంతి చొక్కారపు (sravanthi chokarapu) ఐదో కంటెస్టెంట్‌గా.. ఆర్జే చైతూ (RJ Chaithu) ఆరవ కంటెస్టెంట్.. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్ నుండి అంచెలంచెలుగా ఎదిగిన అరియనా ఏడవ కంటెస్టెంట్ కాగా.. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ నటరాజ్(Natraj) మాస్టర్ ఎనిమిదవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లారు.

Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ కాదు లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌజ్‌, బిగ్ బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన CPI నారాయణ

వర్మ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీరాపాక (Sreerapaka) తొమ్మిదవ కంటెస్టెంట్ గా.. మోడల్ అనిల్ 10వ కంటెస్టెంట్ గా.. తొలి సంధ్య వేళలో’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన మిత్ర శర్మ (Mitra sharma) 11వ కంటెస్టెంట్, బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొన్న తేజస్వి ముదివాడ 12వ కంటెస్టెంట్, బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సరయు ఈ ఓటీటీ షోలో కూడా 13వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. యాంకర్ శివ(Anchor shiva) 14వ కంటెస్టెంట్, ఆవకాయ బిర్యానీ’, ‘రామరామ కృష్ణకృష్ణ’ సినిమాల్లో కథానాయికగా నటించిన బిందుమాధవి (Bindhu Madhavi) 15వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన హమీదా (Hameeda), బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ రన్నరప్‌ అఖిల్ సార్థ‌క్‌ (Akhil Sardhak) 16,17 కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Astrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం..లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అవుతారు..ఆకస్మిక ధనలాభం కలుగుతుంది...ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

Astrology: ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నుంచి ఈ 3 రాశుల వారికి 60 సంవత్సరాల తర్వాత అదృష్ట యోగం ప్రారంభం...వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది..ధన కుబేరులు అవడం ఖాయం..

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం...ధన లక్ష్మీదేవి వీరిపై కృప చూపించడం ఖాయం..అదృష్టం కలిసి వస్తుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..

Astrology: ఫిబ్రవరి 23 నుంచి ఈ 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం...కుబేరుడి దయతో వీరు కోటీశ్వరులు అవడం ఖాయం..లాటరీ, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఖాయం..

Share Now