Jabardasth Avinash Viral Post: జబర్దస్త్ అవినాష్ కుటుంబంలో విషాదం, బిడ్డను కోల్పోయానంటూ అవినాష్ ఎమోషనల్ పోస్ట్

అయితే ఇప్పుడు తనకు జ‌రిగిన విషాదాన్నితెలుపుతూ.. తమ బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. త‌న భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పొయినట్లు ఇన్ స్టా వేదిక‌గా ఎమోషనల్ పోస్ట్ (Avinash Viral Post) పెట్టాడు.

Jabardasth Mukku Avinash (Photo-Twitter)

Hyderabad, JAN 07:  జబర్దస్త్ అవినాష్ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. జబర్దస్త్ షో (Jabardasth Show) ద్వారా వెలుగులోకి వ‌చ్చి షో పేరునే త‌న ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రసుత్తం పలు ఈవెంట్స్, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే అవినాష్ (Avinash Viral Post) త్వరలోనే మేము తల్లిదండ్రులము కాబోతున్నామంటూ తన భార్య అనూజతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తనకు జ‌రిగిన విషాదాన్నితెలుపుతూ.. తమ బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. త‌న భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తమ బిడ్డను కోల్పొయినట్లు ఇన్ స్టా వేదిక‌గా ఎమోషనల్ పోస్ట్ (Avinash Viral Post) పెట్టాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మనాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్. అంటూ అవినాష్ రాసుకోచ్చాడు.