Jabardasth Getup Srinu: గెటప్ శ్రీనుకు ఏమైంది, బయట ఎక్కడా షోలలో కనిపించని జబర్దస్త్‌ కమెడియన్, సినిమాల్లో బిజీగా ఉన్నారంటున్న సన్నిహితులు

విభిన్న రకాల పాత్రలతో షోకు మంచి గుర్తింపు తెచ్చాడు. అలాంటి గెటప్ శ్రీను కూడా జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చేశాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనే క్లారిటీ లేదు.

Getup Srinu and Sudigali Sudheer and Auto Ram Prasad (Photo-Video Grab)

ఈటీవి జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చిన వాళ్లు పక్క ఛానల్స్ లో స్టార్స్‌ గా వెలుగుతున్నారు. జబర్దస్త్‌ లో కాస్త అనుభవం ఉన్నా చాలు మేము కళ్లకు అద్దుకుని తీసుకుంటాం అంటూ కొందరు ఫిల్మ్‌ మేకర్స్ కూడా ముందుకు వస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్‌ లో (Jabardasth) ఒక పది స్కిట్స్ లో కనిపించి జనాల్లో గుర్తింపు దక్కించుకుంటే చాలు సినిమాల్లో లేదా పక్క ఛానల్స్ లో మంచి గుర్తింపు వస్తుంది. పక్క ఛానల్స్ చేయడంతో పాటు హీరోలుగా సినిమాలు చేస్తున్న వారు ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా చేస్తున్న వారు ఉన్నారు.

వీరిలో గెటప్ శ్రీను (Jabardasth Getup Srinu) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విభిన్న రకాల పాత్రలతో షోకు మంచి గుర్తింపు తెచ్చాడు. అలాంటి గెటప్ శ్రీను కూడా జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చేశాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనే క్లారిటీ లేదు. మొన్నటి వరకు సినిమా లతో బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్‌ లో కనిపించడం లేదు.. ఖచ్చితంగా గతంలో మాదిరిగా రెండు మూడు వారాల తర్వాత వస్తాడు అని అంతా అనుకున్నారు. కాని తాజాగా గెటప్‌ శ్రీను (jabardasth fame getup srinu) రాడు అని క్లారిటీ వచ్చేసింది.

కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు, తనను అన్యాయంగా గెంటేశారని తెలిపిన జబర్దస్త్ కమెడియన్ అప్పారావు

గెటప్ శ్రీను స్టార్‌ మా లో కనిపించడం లేదు. ఆయన ప్రస్తుతం చేతిలో పది సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే టీవీల్లో ఇక మీదట ఈయన కనిపించక పోవచ్చు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు. సినిమా ల్లో ఆఫర్లు రాకుంటే అప్పుడు టీవీ వైపు చూస్తాడేమో చూడాలి.