Jabardasth Shaking Seshu: తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే టైపు, ముక్కు అవినాష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన షేకింగ్ శేషు, ఏ స్థాయిలో ఉన్నా ఎవరివల్ల ఎదిగాం అనే విషయాన్ని మరచిపోకూడదని హితవు

బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో జబర్దస్త్ షోకి గుడ్ బాయ్ చెప్పేసి మల్లెమాల నుంచి బయటకు వచ్చేసాడు.

Shaking Seshu (Photo-Video Grab)

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు.జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్.. బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో జబర్దస్త్ షోకి గుడ్ బాయ్ చెప్పేసి మల్లెమాల నుంచి బయటకు వచ్చేసాడు. ఇకపోతే జబర్దస్త్ షో నిర్వాహకులు పెట్టుకున్న నియమం ప్రకారం. జబర్దస్త్‌ షోలో టీం లీడర్‌గా ఉన్న వ్యక్తి బయటకు రావాలంటే. 10 లక్షలు చెల్లించి రావాల్సిరాగా అవినాష్ కూడా మల్లెమాలకు 10 లక్షలు చెల్లించి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

జబర్దస్త్ (Jabardasth) మల్లెమాలలో విడిచి పెట్టిన తర్వాత పలుసార్లు మల్లెమాలపై ముక్కు అవినాష్ (Mukku Avinash) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వ్యక్తులు అందరూ తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే టైపు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు షేకింగ్ శేషు (Jabardasth Shaking Seshu) . మల్లెమాలతో ఏవైనా విభేదాలు ఉంటే పర్సనల్‌గా చూసుకోవాలి కానీ.. ఇలా పబ్లిక్ చేయడం మంచి పద్దది కాదని తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షేకింగ్ శేషు మాట్లాడుతూ మనం ఎక్కడ ఉన్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. ఎవరివల్ల ఎదిగాం అనే విషయాన్ని మరిచిపోకూడదు. వాళ్లలో లోపాలు ఉంటే.. ఆఫీస్‌కి వెళ్లి చెప్పాలి తప్పితే పబ్లిక్ కాకూడదు.. అలాంటి వాళ్లని తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకాలని అంటారు.. ఎందుకంటే నువ్ ఎదిగింది అక్కడ.. పెరిగింది అక్కడ.. ఆ సంస్థ గురించి తప్పుగా చెప్పడం తప్పు. నీకు నిజంగా అన్యాయం జరిగితే.. న్యాయం చేయమని అడగాలి.

గెటప్ శ్రీనుకు ఏమైంది, బయట ఎక్కడా షోలలో కనిపించని జబర్దస్త్‌ కమెడియన్, సినిమాల్లో బిజీగా ఉన్నారంటున్న సన్నిహితులు

జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు అందరూ ఇంతింత సంపాదించి ఇల్లు కట్టుకున్నారంటే కేవలం మల్లెమాల వల్లే. అలాంటి తల్లి లాంటి సంస్థ గురించి తప్పుగా మాట్లాడటం తప్పు అంటూ మండిపడ్డారు షేకింగ్ శేషు. అనంతరం మాట్లాడుతూ ఈ మల్లె మాలలు ధరించి బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి మళ్లీ చేరుతాను అన్నా చేర్చుకోరు. ఎవరైనా ఆర్టిస్టుకి ఏదైనా అవకాశం వచ్చింది అంటే జబర్దస్త్ షో వాళ్ళు వెళ్ళమని చెబుతారు. అప్పుడు జబర్దస్త్ వాళ్ళు వాళ్ళనే నమ్ముకొని కొన్ని ప్లాన్ వేసుకుని ఉంటారు. అలాంటప్పుడు కమెడియన్లు ఆర్టిస్టులు అవకాశం వచ్చింది అని వెళ్ళిపోతాను అంటే వాళ్ళు నష్టపోతారు. అందువల్లే 10 లక్షల సిస్టంను పెట్టారు అని చెప్పుకొచ్చారు షేకింగ్ శేషు.