Kirak RP On Jabardasth: చికెన్, మటన్ పెట్టలేదనే సొల్లు రీజన్స్ తో పుట్టినిల్లు లాంటి జబర్దస్త్ మీద విషం కక్కుతావా, కడుపుకు అన్నం తినే మాటలేనా అవి, కిర్రాక్ ఆర్పీపై షేకింగ్ శేషు కామెంట్స్..

జబర్దస్త్ మాజీ ఆర్టిస్ట్ కిర్రాక్ తాజాగా మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ పైన, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపైన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి.

( Photo-Twitter)

జబర్దస్త్ మాజీ ఆర్టిస్ట్ కిర్రాక్ తాజాగా మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ పైన, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపైన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి.

నిజానికి కేరాఫ్ అడ్రస్ లేని స్థాయి నుంచి ఈ రోజు ఎంతో మంది టాలివుడ్ పరిశ్రామలో ఆర్టిస్టులుగా ఎదిగారంటే దాని వెనుక మల్లెమాల, జబర్దస్త్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని చాలా మంది మీడియాలో చెప్పారు.

జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఆర్టిస్టులైన చమ్మక్ చంద్ర, మహేష్, రచ్చ రవి, వేణు, ధనరాజ్ లాంటి వారు ఎప్పుడు మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మీద, అలాగే నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయలేదు. కానీ కిర్రాక్ ఆర్పీ మాత్రం మల్లెమాల లాంటి దరిద్రమైన నీఛమైన ప్రొడక్షన్ కంపెనీ ప్రపంచంలో ఎక్కడా ఉండదని.. తనకి ఈటీవీ అన్నా.. జబర్దస్త్ అన్నా అస్సలు ఇష్టం ఉండదని తీవ్ర విమర్శలు చేశాడు.

ఇదిలా ఉంటే ఆర్పీని అసలు జనం గుర్తు పడుతున్నారన్నా.. ఈ స్థాయిలో ఉన్నాడంటే అది జబర్దస్త్ వల్లే అని జబర్దస్త్ టీంలో మాజీ సభ్యుడైన షేకింగ్ శేషు ఫైర్ ఆయ్యారు.

ప్రొడక్షన్ వాళ్లు చికెన్ పెట్టలేదు, మటన్ పెట్టలేదు ఉక్రోశం వెళ్లగక్కుతున్నావు, కానీ నీకు అవకాశాలు ఇవ్వడం వల్లే ఈ స్థాయికి వచ్చావనే సంగతి మరిచిపోయావు అని అన్నారు. రోజుకు 200మందికి మల్లెమాల ప్రొడక్షన్ వాళ్లు భోజనం పెడతారని, అందులో ఒక్కోసారి కొన్ని ఐటంలు బాగోకపోవచ్చని, బాలేకపోతే బయట నుంచి తెప్పించుకునే వెసులుబాటు ఉందని గుర్తుచేశారు.

మల్లెమాలపైఅంత కోపం ఎందుకు.. ? శ్యామ్ ప్రసాద్ రెడ్డి చేసిన అన్యాయం ఏంటో చెప్పాలని అన్నారు. ఈ రోజు ప్రతీ ఒక్క జబర్దస్త్ ఆర్టిస్టు ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యారని షేకింగ్ శేషు గుర్తు చేశారు. నాగబాబు, ధనరాజ్, వేణు, అవినాష్, సుధీర్, చంద్ర, ఇలా చాలా మంది బయటకు వచ్చేశారు. కానీ కిర్రాక్ ఆర్పీలా చేయలేదని శేషు మండిపడ్డారు.