Tom and Jerry: టామ్ అండ్ జెర్రీకి 80 ఏళ్లు, నవ్వులు పూయిస్తున్న ఫస్ట్ వీడియో క్లిప్, ఏడు ఆస్కార్ అవార్డులు, 114 ‘టామ్ అండ్ జెర్రీ’ సినిమాలు
టీవీల్లో ఈ ప్రోగ్రాం వస్తుందంటే చాలు చిన్నారులు ఎగిరి గంతులు వేస్తారు. ప్రేక్షకులకు ఈ టామ్ అండ్ (Tom and Jerry) పరిచయమై నేటికి 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1940, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి 'టామ్ అండ్ జెర్రీ' ప్రసారమైంది.
Washington, Febuary 10: టామ్ అండ్ జెర్రీ...వీటి గురించి ప్రపంచానికి పరిచయం అక్కర్లేదు. అమెరికాలో పుట్టిన ఎలుక, పిల్లి కార్యక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఎప్పడు కలిసినట్లుగా ఉండే ఈ రెండు జంతువుల క్యారక్టర్లు (Cat and Mouse) పోట్లాడుకుంటూ అందరికీ వినోదాన్ని పంచుతూ ఉంటాయి. చాలామంది స్నేహితులు సైతం మేము టామ్ అండ్ జెర్రీలా ఉంటామని కూడా చెబుతుంటారు. అంతటి స్థాయిని ఇవి సొంతం చేసుకున్నాయి.
ఇక చిన్న పిల్లల గురించి అయితే చెప్పనే అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ప్రోగ్రాం ఇదొక్కటేనని చెప్పవచ్చు. టీవీల్లో ఈ ప్రోగ్రాం వస్తుందంటే చాలు చిన్నారులు ఎగిరి గంతులు వేస్తారు. ప్రేక్షకులకు ఈ టామ్ అండ్ (Tom and Jerry) పరిచయమై నేటికి 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1940, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి 'టామ్ అండ్ జెర్రీ' ప్రసారమైంది.
బ్రహ్మస్త్ర వచ్చేస్తోంది, డిసెంబర్ 4, 2020న ప్రేక్షకుల ముందుకు
అయితే, అప్పట్లో ఇది 'టామ్ అండ్ జెర్రీ' పేరుతో కాకుండా 'ది మిడ్‌నైట్ స్నాక్' పేరుతో వచ్చింది. 'పస్ గెట్స్ ది బూట్' ఎపిసోడ్ పేరుతో మొట్టమొదటి షార్ట్ ఫిలిమ్ విడుదలైంది. పిల్లి పేరు జాస్పర్‌గా, ఎలుక పేరు జింక్స్‌గా అప్పట్లో రూపొందించారు. ఆ తర్వాతి ఏడాది నుంచి దీని పేరు 'టామ్ అండ్ జెర్రీ'గా మారింది. చిన్నారులతో పాటు పెద్దలూ ఇష్టంగా చూసే 'టామ్ అండ్ జెర్రీ' సృష్టికర్తలు విలియం హన్నా, జోసెఫ్ బార్బారా.
1940లో 'ది మిడ్‌నైట్ స్నాక్' గా మొదలు పెట్టి 1958 వరకు మొత్తం 114 ‘టామ్ అండ్ జెర్రీ’ సినిమాలను రూపొందించారు. వీరికి ఏడు ఆస్కార్ అవార్డులు దక్కాయి. టామ్ అండ్ జెర్రీ 80 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈ పిల్లి, ఎలుకలను నెటిజన్లు గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ 'టామ్ అండ్ జెర్రీ' పరిచయమై నేటికి 80 ఏళ్లు అవుతోన్న సందర్భంగా మొట్టమొదటి ఎపిపోడ్ ని (First Tom and Jerry Video clip) ఔత్సాహికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని గుర్తు చేసుకుంటూ అందరూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.