అంతర్జాతీయంగా సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డ్స్‌గా చెప్పబడే "ఆస్కార్" (The Oscars) 92వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 9, 2020న (భారతదేశంలో ఫిబ్రవరి 10) USA లోని కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. నటన, దర్శకత్వం మొదలుకొని సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మేకప్ మరియు స్టైలింగి వరకు అన్ని క్రాఫ్ట్ లలో తెరమీద, తెరవెనుక అత్యున్నత ప్రదర్శన కనబరిచిన ప్రతిభావంతులకు 'ఆస్కార్' అవార్డ్ అందజేసి వారిని గౌరవించారు. వరుసగా రెండో ఏడాది కూడా ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం హోస్ట్ లేకుండానే జరిగింది. హోస్ట్ స్థానంలో చాలా మంది వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీలు అవార్డులను తమ చేతుల మీదుగా అందజేస్తున్నారు.
అవార్డులు లభించిన సినిమాల్లో (Oscar Winners 2020) టాడ్ ఫిలిప్స్ జోకర్, పారాసైట్, సామ్ మెండిస్ 1917, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, ది ఐరిష్ మ్యాన్, లిటిల్ తదితర చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టాయి. అయితే ఆశ్చర్యకరంగా 'పారాసైట్' (Parasite) - ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడు సహా నాలుగు ప్రధాన అవార్డులను తన ఖాతాలో వేసుకొని రికార్డ్ బద్దలు కొట్టింది.
ఆస్కార్ రేసులో నిలిచిన వారు మరియు గెలిచిన వారు; నామినేషన్స్ & విన్నర్స్
ఉత్తమ చిత్రం
ఫోర్డ్ వి ఫెరారీ
ది ఐరిష్ మ్యాన్
జోజో రాబిట్
జోకర్
లిటిల్ విమెన్
మ్యారెజ్ స్టోరీ
1917
వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్
పారాసైట్ - విన్నర్
ఉత్తమ దర్శకుడు
మార్టిన్ స్కోర్సెస్, ది ఐరిష్
టాడ్ ఫిలిప్స్, జోకర్
సామ్ మెండిస్, 1917
క్వెంటిన్ టరాన్టినో, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్
బాంగ్ జూన్-హో, పారాసైట్ - విన్నర్
ఉత్తమ నటి
సింథియా ఎరివో, హ్యారియెట్
స్కార్లెట్ జోహన్సన్, వివాహ కథ
సావోయిర్స్ రోనన్, లిటిల్ ఉమెన్
చార్లిజ్ థెరాన్, బాంబ్‌షెల్
రెనీ జెల్వెగర్, జూడీ - విన్నర్
ఉత్తమ నటుడు
ఆంటోనియో బాండెరాస్, పెయిన్ అండ్ గ్లోరీ
లియోనార్డో డికాప్రియో, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్
ఆడమ్ డ్రైవర్, మ్యారెజ్ స్టోరీ
జోనాథన్ ప్రైస్, ది టూ పోప్స్
జోక్విన్ ఫీనిక్స్, జోకర్ - విన్నర్
ఉత్తమ సహాయ నటుడు
టామ్ హాంక్స్, ఎ బ్యూటిఫుల్ డే ఇన్ ది నైబర్హుడ్
ఆంథోనీ హాప్కిన్స్, ది టూ పోప్స్
అల్ పాసినో, ది ఐరిష్
జో పెస్కి, ది ఐరిష్
బ్రాడ్ పిట్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ - విన్నర్
ఉత్తమ (ఒరిజినల్) స్క్రీన్ ప్లే
నైవ్స్ ఔట్
మ్యారెజ్ స్టోరీ
1917
వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్
పారాసైట్ - విన్నర్
ఉత్తమ (అడాప్టెడ్) స్క్రీన్ ప్లే
ది ఐరిష్ మ్యాన్
జోకర్
లిటిల్ విమెన్
ద టూ పోప్స్
జోజో రాబిట్ - విన్నర్
ఉత్తమ దుస్తులు డిజైన్
ది ఐరిష్ మ్యాన్
జోజో రాబిట్
జోకర్
వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్
లిటిల్ విమెన్ - విన్నర్
ఉత్తమ సహాయ నటి
కాథీ బేట్స్, రిచర్డ్ జ్యువెల్
స్కార్లెట్ జోహన్సన్, జోజో రాబిట్
ఫ్లోరెన్స్ పగ్, లిటిల్ విమెన్
మార్గోట్ రాబీ, బాంబ్‌షెల్
లారా డెర్న్, మ్యారేజ్ స్టోరీ - విన్నర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ
ది ఐరిష్ మ్యాన్
జోకర్
లైట్ హౌస్
వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్
1917 - విన్నర్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
ఎవెంజర్స్ ఎండ్‌గేమ్
ది ఐరిష్ వ్యక్తి
మృగరాజు
స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్
1917 - విన్నర్
ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం
కార్పస్ క్రిస్టి
హనీల్యాండ్
లెస్ మిజరబుల్స్
పెయిన్ & గ్లోరీ
పారాసైట్ - విన్నర్
జోకర్ సినిమాలో తన అసాధారణ నటనకు గానూ జోక్విన్ ఫీనిక్స్ (Joaquin Phoenix) కు ఉత్తమ నటుడు అవార్డ్ దక్కింది. ఫీనిక్స్ కు తన కెరియర్ లో ఇదే తొలి ఆస్కార్.