Gitanjali Aiyar Passed Away: మూడుదశాబ్దాల పాటూ దేశప్రజలకు వార్తలు వినిపించిన ఆమె ఇక లేరు, తొలితరం ఇంగ్లీష్ న్యూస్ రీడర్‌ గీతాంజలీ అయ్యర్ మరణంపై కేంద్రమంత్రి సంతాపం

గతకొంతకాలంగా పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) సంతాపం తెలిపారు.

Gitanjali Aiyar Passed Away (PIC@ Twitter)

New Delhi, June 08: దేశంలో తొలితరం మహిళా ఇంగ్లిష్‌ న్యూస్‌ యాంకర్లలో (News anchor) ఒకరైన గీతాంజలి అయ్యర్‌ (Gitanjali Aiyar) కన్నుమూశారు. గతకొంతకాలంగా పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) సంతాపం తెలిపారు. దూరదర్శన్ (Doordarshan)‌, ఆల్‌ ఇండియా రేడియోలో మొదటి ఇంగ్లిష్ న్యూస్‌ యాంకర్లలో (English news presenter) ఆమె ఒకరని చెప్పారు. దూరదర్శన్‌కు ఆమె చేసిన సేవలను కొనియాడారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోల్‌కతాలోని లొరెటో కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన గీతాంజలి.. 1971లో దూరదర్శన్‌లో చేరారు. 30 ఏండ్లపాటు ప్రజలకు వార్తలను అందించారు. దూరదర్శన్‌లో కెరీర్‌ ముగిశాక.. కార్పొరేట్‌ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీలో పని చేసిన ఆమె.. ఖాందాన్‌ (Khandaan) అనే సీరియల్‌లోనూ నటించారు. 

HC on Child Custody: భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోతే పిల్లల కస్టడీ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవచ్చు..రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. 

నాలుగుసార్లు ఉత్తమ యాంకర్‌ అవార్డు అందుకున్నారు. మీడియా రంగానికి చేసిన సేవలకుగాను 1989లో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డ్‌ ఫర్‌ ఔట్‌స్టాండింగ్‌ ఉమెన్‌ పురస్కారాన్ని దక్కించుకున్నారు.



సంబంధిత వార్తలు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Telangana Assembly Sessions: మంత్రులే ప్రశ్నలు అడుగుతారా?, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్..హరీశ్‌ రావు ఫైర్, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్న మంత్రి ఉత్తమ్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif