Andhra Pradesh Shocker: కర్నూలులో దారుణం, విద్యార్థితో గే సెక్స్‌కు అలవాటుపడిన తెలుగు టీచర్, విషయం తెలిసి చితకబాదిన గ్రామస్థులు
: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు గాడి తప్పి విద్యార్థితో గే సెక్స్ కు బానిస అయ్యాడు. ఆ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సదరు బాలుడి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు.
కర్నూలు, అక్టోబ్ 3: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు గాడి తప్పి విద్యార్థితో గే సెక్స్ కు బానిస అయ్యాడు. ఆ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సదరు బాలుడి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మంగళవారం మండలంలోని ఉప్పల పాడు గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో గత నాలుగేళ్లుగా రాంబాబు అనే వ్యక్తి తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థితో అతను చనువు పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఉయ్యాలవాడ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు.
అక్కడికి వెళ్లిన ఈ టీచర్ లైగింక వేధింపులకు గురిచేస్తుండటంతో విద్యార్థి భరించలేక తల్లిదండ్రులకు తెలియచేశాడు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. తప్పు ఒప్పుకోకపోవడంతో దేహశుద్ధి చేసిన గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)