Centre Warns Latecomers: ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు.. త్వరగా ఇంటికి వెళ్ళినా కూడా.. సంబంధిత శాఖలకు కేంద్రం ఆదేశాలు.. ఒక్క రోజు ఆఫీసుకు ఆలస్యమైనా ఒక సీఎల్ తొలగించాలని సూచన
ప్రభుత్వ కార్యాలయాలు అంటే లేటుగా పని మొదలు.. త్వరగా ముగింపు అనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి.. త్వరగా ఇంటికి వెళ్లే ఉద్యోగులపై కేంద్రం సీరియస్ అయ్యింది.
Newdelhi, June 17: ప్రభుత్వ కార్యాలయాలు (Central Government Offices) అంటే లేటుగా (Late) పని మొదలు.. త్వరగా ముగింపు అనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి.. త్వరగా ఇంటికి వెళ్లే ఉద్యోగులపై కేంద్రం (Central Government) సీరియస్ అయ్యింది. ఇలాంటి వారితో సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆధార్ తో అనుసంధానమైన బయోమెట్రిక్ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని, మరికొందరు తరచూ ఆఫీసుకు ఆలస్యమవుతున్నారని గుర్తించినట్టు తెలిపింది. ఈ మేరకు ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం ఆదేశాలు ఇలా..
- ఆలస్యంగా వచ్చిన ఒక్కరోజుకు ఒక పూట సాధారణ సెలవు చొప్పున కోతపెట్టాలి.
- ఒకవేళ సీఎల్ లు లేకపోతే ఆర్జిత సెలవుల నుంచి తగ్గించాలి.
- తగిన కారణాలు ఉన్నట్టైతే మాత్రం నెలలో గరిష్ఠంగా రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా ఆలస్యంగా రావడాన్ని క్షమించవచ్చు.
- ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లిపోవడాన్ని ఆలస్యంగా రావడంతో సమానంగానే చూడాలి. దానికి పై నిబంధనలే పాటించాలి.
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో
Advertisement
Advertisement
Advertisement