Woman Kills Boyfriend: బాయ్‌ఫ్రెండ్‌ చీటింగ్‌, కోపంతో ప్రియుడిని కారుతో గుద్ది చంపిన ప్రియురాలు, యుఎస్‌లోని ఇండియానాపోలిస్‌లో ఘటన

ఈ ఘటనలో ఇరవై ఆరేళ్ల గేలిన్ మోరిస్‌ను ఇండియానాపోలిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Indiana, June 6: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఒక మహిళ తన బాయ్‌ఫ్రెండ్ అని చెప్పుకునే వ్యక్తిని అనుసరించి, తన కారుతో అతనిపైకి దూసుకెళ్లిందని నివేదించిన తర్వాత ఆమెపై హత్య కేసు నమోదైంది. ఈ ఘటనలో ఇరవై ఆరేళ్ల గేలిన్ మోరిస్‌ను ఇండియానాపోలిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ స్మిత్ తనను చీటింగ్‌ చేస్తున్నట్లు 26 ఏళ్ల గేలిన్ మోరిస్ అనుమానించింది. ఆపిల్‌ ఫోన్‌లోని ఎయిర్‌ ట్యాగ్‌ ద్వారా అతడి కదలికలను ట్రాక్‌ (Indiana woman allegedly tracks boyfriend) చేయసాగింది.

ఒక బార్‌ వద్ద స్మిత్‌ ఉన్నట్లు పసిగట్టి అక్కడకు వెళ్లింది. అతడి వెంట ఒక అమ్మాయి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీ వైన్‌ బాటిల్‌తో ఆమెపై దాడి చేయబోగా స్మిత్‌ జోక్యం చేసుకున్నాడు. దీంతో బార్‌ సిబ్బంది ఆ ముగ్గురిని బయటకు పంపారు. కాగా, బార్‌ బయట స్మిత్‌పై మోరిస్ దాడి (kills him after spotting him) చేసింది. అతడ్ని పలుమార్లు కొట్టింది.

భర్త కాదు కిరాతకుడు, భార్యను చంపి, శవాన్ని ముక్కలుగా చేసిన డ్రమ్ములో దాచిపెట్టాడు, జూబ్లీహిల్స్‌ పరిధిలో దారుణ ఘటన

చేతులు కట్టేసి రోడ్డుపై పడేసింది. అనంతరం కారును అతడి మీదుగా నడిపింది. ఆ తర్వాత కారును ఆపిన మోరిస్‌, ఫుడ్‌ ఆర్డర్‌ కోసం ఆ రెస్టారెంట్‌ వద్ద వేయిట్‌ చేస్తున్న ఆ అమ్మాయిపై దాడి చేయబోయింది. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన స్మిత్‌ (Woman Kills Boyfriend) అప్పటికే చనిపోయినట్లు గ్రహించారు. మృతుడి ప్రియురాలైన మోరిస్‌ను అరెస్ట్‌ చేశారు.

.