AP Degree Exams Cancelled: ఏపీలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు, ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం, డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు నేరుగా పై తరగతులకు ప్రమోట్
యూజీ, పీజీ కోర్సుల పరీక్షలు, అకడమిక్ క్యాలెండర్‌పై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సంప్రదాయ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులన్నింటి పరీక్షలు (UG / PG Semester Exams) రద్దు చేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చారు.
Amaravati, June 24: కరోనావైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా పరీక్షలు నిర్వహించకుండానే (AP Degree Exams Cancelled) పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది! విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సెలర్లు, రెక్టార్లు, రిజిస్ట్రార్లతో మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. యూజీ, పీజీ కోర్సుల పరీక్షలు, అకడమిక్ క్యాలెండర్‌పై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సంప్రదాయ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులన్నింటి పరీక్షలు (UG / PG Semester Exams) రద్దు చేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి మరోసారి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు! విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్లు వెల్లడి
పరీక్షలు లేకుండానే పైతరగతులకు పంపడం మంచిదని వీసీలు అభిప్రాయపడ్డారు. మంత్రి సురేశ్ (Minister Adimulapu Suresh) కూడా ఇందుకే మొగ్గు చూపారు. యూజీ, పీజీ చివరి సెమిస్టర్ విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించనుంది. పరీక్షలు లేకుండానే విద్యార్థులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఉన్నత చదువులకు వెళ్లేవారికి, ఉద్యోగాల్లో చేరేవారికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోనున్నారు.
కాగా మిగిలిన సెమిస్టర్ పరీక్షలు అనుకూల పరిస్థితులను బట్టి నిర్వహించుకునే అధికారం స్థానిక యూనివర్సిటీలకే అప్పగించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సెమిస్టర్ పరీక్షల రద్దుపై వర్సిటీ పాలకమండలి సభ్యులు తీర్మానం చేసుకోవాలని నిర్ణయించారు. డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలు ఒకే రోజు విడుదల, పాసయ్యారో లేదో చెక్ చేసుకోవడం ఎలా ?
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలలు-112, పీజీ-20, ఎంబీఏ, ఎంసీఏ-3, బీఈడీ-62, ఎంఈడీ-10, ఇతర కళాశాలలు-8 ఉన్నాయి. ఈ కళాశాలల్లో చివరి సెమిస్టర్ చదువుతున్నవారు డిగ్రీలో 12,741 మంది, పీజీలో 1,423 మంది విద్యార్థులు ఉన్నారు. డిగ్రీ కోర్సులైన బీఎస్సీ, బీఏ, బీకాం ఉండగా...పీజీ కోర్సులైన ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్‌లతోపాటు వృత్తివిద్యా కోర్సులైన బీటెక్, బీఈ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ కోర్సుల్లో ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌ఎం తదితర కోర్సులకు 2019-20 వార్షిక పరీక్షలు జరగడం లేదు.