AP Inter Results 2024 Declared: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల, ఫెయిలైతే ఆందోళన చెందవద్దని కోరిన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్, చెక్ చేసుకోవడానికి లింక్ ఇదిగో..

ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.

Exams Results

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు(AP Inter Exams) విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కమిషనర్ ఒకే సమయంలో విడుదల చేశారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు http://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, సెకండ్ ప్లేస్‌లో గుంటూరు, థర్డ్ ప్లేస్‌లో ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయి. హుర్రే... ఏపీ ఇంట‌ర్ మొదటి, రెండో ఏడాది ఫ‌లితాలు విడుదల.. రిజల్స్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే??

ఈసారి ఇంటర్ పాస్ పర్సంటేజ్‌లో బాలికలే పైచేయి సాధించారని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఫెయిల్ అయిన విద్యార్థులకు వెంటనే సప్లిమెంటరీ ఉంటుందని, పిల్లలకు మరో అవకాశం ఉంటుందన్నారు. సప్లమెంటరీ, మెయిన్ ఎగ్జామ్స్‌కు ఎలాంటి తేడాలు ఉండవన్నారు.

ఫస్టియర్‌ పరీక్షలను 4 లక్షల మంది విద్యార్థులు రాయగా 67 శాతం, సెకండియర్‌ పరీక్షలకు 3 లక్షల మంది హాజరుకాగా 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ పరీక్ష రాసిన 38 వేల మందిలో 71 శాతం పాసయ్యారు.

చెక్ చేసుకోవడానికి లింక్స్ ఇవిగో..

ఫస్ట్ ఇయర్ లింక్

సెకండ్ ఇయర్ లింక్