CBSE 12th Result 2020 Declared: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, పదో తరగతి ఫలితాలు కూడా త్వరలో విడుదల, ఫలితాలను http://results.nic.in/ లేదా http://cbse.nic.in/ లేదా http://cbseresults.nic.in/ ద్వారా చెక్ చేసుకోండి

ఈ మేరకు జులై 13న విడుదల చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (HRD) శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఈ రోజు ఫలితాలు (CBSE 12th Result 2020) విడుదలయ్యాయి.

Representational Image (Photo Credits: File Image)

New Delhi, July 13: సీబీఎస్ఈకి చెందిన 12వ తరగతి పరీక్ష ఫలితాలు (CBSE 12th Result 2020 Declared) విడుదలయ్యాయి. ఈ మేరకు జులై 13న విడుదల చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (HRD) శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఈ రోజు ఫలితాలు (CBSE 12th Result 2020) విడుదలయ్యాయి. సీబీఎస్ఈ సిలబస్ 30 శాతం తగ్గింపు, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన హెచ్‌ఆర్‌డి మంత్రి, కరోనా సమయంలో కోల్పోయిన సమయాన్ని తిరిగి భర్తీ చేసేలా నిర్ణయం

పరీక్షల ఫలితాలు http://results.nic.in/ లేదా http://cbse.nic.in/ లేదా http://cbseresults.nic.in/ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. పరీక్షలు రాసిన వారు ఈ వెబ్ సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. పదో తరగతి ఫలితాలను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. మరోవైపు సీబీఎస్ఈ సిలబస్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే 30 శాతం సిలబస్ తగ్గించారు. ఇంటర్నల్ అసెస్ మెంట్ ప్రక్రియ ఆధారంగా బోర్డు పరిణామాలుంటాయని సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది.

ఇప్ప‌టికే సీబీఎస్ఈ బోర్డు క‌రోనా కార‌ణంగా ప‌లు వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది. ఇదే విష‌యాన్ని బోర్డు జూన్ 26వ తేదీన సుప్రీం కోర్టుకు తెలిపింది. జూలై 15వ తేదీ వ‌ర‌కు ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తామ‌న్నారు. చెప్పిన‌ట్లుగానే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ప‌రీక్ష‌ల్లో మొత్తం 38,686 మంది విద్యార్థులు (3.24 శాతం మంది) 95 శాతానికి పైగా మార్కుల‌ను సాధించార‌ని బోర్డు తెలిపింది. మొత్తంగా 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. గ‌తేడాది 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ సారి కొంత ఉత్తీర్ణ‌త శాతం పెరిగింది. ఈ సంద‌ర్భంగా ప‌రీక్ష‌లు పాసై వారికి విద్యాశాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ శుభాకాంక్ష‌లు తెలిపారు.